మిడ్ నైట్ స్మశానంలో షూటింగ్.. ఆ టైంలో నన్ను చూసుకొని నేనే భయపడ్డా.. హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

అల్లు అర్జున్ న‌టించిన‌ దేశముదురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హ‌న్సికా. తర్వాత ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటించిన ప్ర‌త్యేక‌మైన ఈమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు టాలీవుడ్‌ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ బ్యూటీ తర్వాత టాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గడంతో ఇతర భాషల్లో అడుగుపెట్టి తన సత్తా చాటుకుంది. బహుభాషా నటిగా భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న హన్సికా.. తాజాగా నటించిన సినిమా గార్డియ‌న్‌. హారర్ బ్యాక్‌డ్రాప్తో తెరకెక్కిన‌ ఈ సినిమాల్లో ఓ అందమైన యువతిగా, దెయ్యంగా డ్యూయ‌ల్ రోల్‌లో నటించింది హన్సిక.

ఫిలిం బాక్స్ బ్యానర్ పై.. విజయచంద్ర ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు శబరి, గురుశ‌ర‌వ‌ణ‌న్‌ దర్శకుడుగా వ్యవహరించాడు. స్యామ్ సీయ‌స్‌ సంగీతం అందించగా.. శక్తివేల్ సమర్పణలో.. ఈ సినిమా తెర‌కెక్కింది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక‌ అరుణ్మానై లాంటి హారర్ సిరీస్ తర్వాత హన్సిక నటించిన మరో హారర్ మూవీ ఇదే కావడం విశేషం. ఇక హన్సిక ఈ మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ గార్డియన్ సినిమాలో నటించడం ఓ కొత్త అనుభవం అని.. ఈ సినిమాలో దెయ్యం పాత్ర కోసం ఎంతో శ్రద్ధ పెట్టి నటించాల్సి వచ్చింది అంటూ వివరించింది. ఇందులో నా గెటప్ చాలా స్పెషల్ గా ఉంటుందని.. లుక్ కోసం స్పెషల్ లైన్స్ పెట్టుకున్నట్లు వివరించింది.

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను స్మశానంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో షూట్ చేశారని.. అది తలకిందులుగా వేలాడుతున్న దెయ్యంలా నేను నటించడం పెద్ద సవాలు అనిపించిందంటూ చెప్పుకొచ్చింది. ఆ టైంలో దెయ్యం గెటప్ లో నన్ను నేనే చూసుకుని భయపడ్డాను అని చెప్పకొచ్చింది హన్సిక. పెళ్ళి తర్వాత కూడా నటించడంలో తనకేమీ తేడా అనిపించడం లేదని పేర్కొంది. ఆమెకు తన హస్బెండ్, మదర్ సపోర్ట్ ఎంతగానో ఉందంటూ వివరించింది. ఇక హ‌న్సిక‌ నటిస్తున్న ఇత‌ర సినిమాలు గాంధారి, ది మెన్‌ త్వరలోనే రిలీజ్ కానున్నాయి.