డార్లింగ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ రాజా సాబ్ ‘ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా ఒకటి. అవుట్ అండ్ అవుట్ ఎంట్ర్ టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పుడిప్పుడే మంచి హైప్‌ నెలకొంటుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ భారీ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిన్న, మొన్నటి వరకు ప్రభాస్.. మారుతి కాంబినేషన్ సినిమా ఏంటి.. అసలు వర్కౌట్ అవుతుందా.. అని భావించిన వారందరి ఆలోచనలు బెడిసి కొట్టేలా.. మొదటి పోస్టర్‌ తోనే మంచి హైప్‌ను క్రియేట్ చేశాడు మారుతి. రాజా సాబ్‌ పోస్టర్లో డార్లింగ్ లుక్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

బాహుబలి తర్వాత నుంచి ఫ్యాన్స్ మిస్ అయిన వింటేజ్ ప్రభాస్‌ను ఈ సినిమాతో చూడవచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాపై రోజురోజుకు ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరుగుతున్నాయి. ఇంకా ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ తప్ప మరే అప్డేట్ రాలేదు. పైగా ఈ సినిమా ఏడాదిలోనే రిలీజ్ చేస్తారని ప్రేక్షకులు భావించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 2025 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట‌. స‌లార్ 2 షూట్ కూడా ప్రారంభం అయితే మరింత లేటవుతుంది. లేదా ఎటువంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ కంప్లీట్ అయితే ఈ ఏడాది చివరిలోనే క్రిస్మస్ కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఇక హారర్ కామెడీ థ్రిల్లర్గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా రజనీకాంత్ చంద్ర‌ముఖి తరహాలో ఉండనుందట. అయితే ఆ సినిమా కథకు ఈ సినిమా కథకు పోలిక ఉండదు. అక్కడ చంద్రముఖి భవనం ఉన్నట్టు.. ఇక్కడ ఓ థియేట‌ర్ నేపథ్యంలో సినిమా కొనసాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ క‌థ కీలకంగా ఉండనుందట. ఇక ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించి మెప్పించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న‌ ఈ సినిమాకు థ‌మన్‌ సంగీతం అందిస్తున్నాడు.