మహేష్ బాబు చేసిన రాజకుమారుడు మూవీలో కృష్ణ పాత్రలో రిటెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మ‌హేష్‌బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మొదట రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ ఆ సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు మహేష్ బాబుకి కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం ఈ మూవీలో కృష్ణ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు.అయితే ఈ పాత్ర కోసం మొదట రాఘవేంద్రరావు ఓ సీనియ‌ర్ స్టార్ హీరోని అప్రోచ్ అయ్యార‌ట‌. కానీ ఆ హీరో ఆ మూవీ రిజ‌క్ట్ చేయ‌డంతో ఆ పాత్ర‌లో కృష్ణ గారు న‌టించారు.

ఇంతకీ రాజకుమారుడు సినిమాలో కృష్ణగారి రోల్‌ను రిజెక్ట్ చేసిన ఆ స్టార్‌ హీరో ఎవరు.. ఎందుకు రిజెక్ట్ చేశాడో.. ఒకసారి తెలుసుకుందాం. ఆయన మరెవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు. రాఘవేంద్ర మొదట నాగేశ్వరరావు గారిని కలిసి ఈ పాత్రను చేయమని అడిగారట. అయితే నాగేశ్వరరావు ఈ పాత్రను ఏవో కారణాలతో రిజెక్ట్ చేశాడట‌. దీంతో తర్వాత రాఘవేంద్రరావు కృష్ణ గారిని ఈ పాత్ర కోసం ఒప్పించి.. సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మహేష్ బాబుకి సపోర్టింగ్ రోల్ లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మూవీ హిట్ అవడంలో కీలకపాత్రను పోషించారు. ఈ సినిమాతో మహేష్ బాబుకు వచ్చిన క్రేజ్‌తో వరుస సినిమాల ఆఫర్లు క్యూ కట్టాయి.

అలా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళితో పాన్ వర‌ల్డ్‌ సినిమాను తెరకెక్కించే రేంజ్‌కు ఎదిగిన మహేష్.. ఈ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌లో అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఇంకా సెట్స్‌ పైకి రాని ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా తమ ఫేవరెట్ హీరో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలో న‌టిస్తున్నాడని తెలియడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా ఇప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ అన్ని మహేష్ బ్రేక్‌ చేస్తాడంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.