ఈ బ్యూటీస్ ఐటెం సాంగ్స్ చేయాలంటే అది ఉండాల్సిందే.. మీరు గమనించారా..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్స్ చేయడం సర్వసాధారణం. ఇప్పటికే చాలామంది అలా హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేసి మెప్పించిన సినిమాలు ఉన్నాయి . అయితే చాలామంది హీరోయిన్స్ ఐటెం సాంగ్ అంటే డెఫినెట్గా రెమ్యూనరేషన్ హై ఎక్స్ పెక్ట్ చేస్తారట . దాదాపు కోటి రూపాయలు పైన ఉంటే రెమ్యూనరేషన్ ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఓకే చేస్తారట .

అలాంటి హీరోయిన్స్ పేర్లు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి . సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ కూడా ఇదే తంతుని ఫాలో అవుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది .ఇలాంటి టాప్ హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్స్ కి హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారట. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ డైరెక్టర్ లు ఏరి కోరి టాప్ హీరోయిన్స్ ని తమ సినిమాలో ఐటెం సాంగ్స్ చేయడానికి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు . అలాంటి డైరెక్టర్ లు విషయంలో అస్సలు వెనకడుగు వేయరట.

అంతేకాదు మరి కొంతమంది హీరోయిన్స్ ఐటెం సాంగ్ కేవలం ఒక్కటే రోజు లోనే కంప్లీట్ అయిపోవాలి అంటూ క్రేజీ కండిషన్స్ కూడా పెడుతూ ఉంటారట. మరి కొంతమంది హీరోయిన్స్ అయితే వల్గర్ స్టెప్స్ ఉండకూడదు అని.. మరి కొంతమంది హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట . ఇలా ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క కండిషన్ పెడుతూ డైరెక్టర్స్ ని ముప్పుతిప్పలు పెట్టేస్తూ ఉంటారట. ఫైనల్లీ ఐటమ్ సాంగ్ హిట్ అయితే ఆ కిక్కే వేరు అంటున్నారు అభిమానులు..!!