భర్త నితిన్ కపూర్ సూసైడ్ చేసుకుంటాడని జయసుధకు ముందే తెలుసా.. షాకింగ్ సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ బ్యూటీ..

ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ‌య‌సుధ‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక జయసుధ భర్త కొంతకాలం క్రితం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓఇంట‌ర్వ్యూలో పాల్గొన్న జయసుధ దీనిపై ఆసక్తికర విషయాలను వివరించింది. మొదటిసారి తన భర్త సూసైడ్ వెనుక జరిగిన సంఘటన ఏంటో వెల్ల‌డించింది. జ‌య‌సుధ భర్త.. ప్రొడ్యూసర్ నితిన్ కుమార్ ఏడేళ్ల క్రితం సూసైడ్ చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ.. జయసుధ దానికి కారణం అంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికి కొన్ని మీడియాల్లో ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలో తాజాగా దీనిపై స్పందించిన జయసుధ.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు విషయాలను వివరించింది. నా భర్త చావుకి నేను కారణం కాదని.. తన సినిమాలు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి నష్ట పోవడం వల్ల సూసైడ్ చేసుకున్నాడు అనేదానిలో వాస్తవం లేదని.. అప్పులు ఉన్నాయి కానీ.. అవి డిప్రెషన్ లోకి వెళ్లి తీర్చలేనంత పెద్ద సమస్యలు కావని వివ‌రించింది. అసలు అప్పులు భరించలేక సూసైడ్ చేసుకునే పరిస్థితిలోనూ మేము లేము అంటూ వివరించింది. ఈ విషయంలో జయసుధ చేసిన షాకింగ్ కామెంట్స్ ప్ర‌స్తుతం వైరల్ గా మారాయి. తన భర్త నితిన్ కపూర్ సూసైడ్ చేసుకుంటాడని తనకు ముందే తెలుసని.. వారి ఫ్యామిలీలో ఇప్పటికే చాలామంది అలా ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించింది.

వాళ్ళ అన్న అత్తగారి ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఆడపడుచులు ఇలానే ఆత్మహత్య చేసుకుని చనిపోయారని.. ఏదైనా ప్రెషర్ అనిపిస్తే వాటిని హ్యాండిల్ చేయడం వీళ్ల వల్ల కాదు అని.. ఇలానే సూసైడ్ చేసుకుంటారు అని వివరించింది. అది వారి ఫ్యామిలీ కి ముందు నుంచే వస్తున్న అలవాటని వివరించింది. తన భర్త కూడా ఆత్మహత్య చేసుకుంటాడని ఆమె భావించినట్లు చెప్పుకొచ్చింది. ఇంట్లో సమస్యలు ఉన్నాయని చాలా రోజుల అది అలానే కంటిన్యూ అయ్యాయని దీంతో నా భర్త ఇలాంటి పని చేసుకున్నాడని ఆమె వివరించింది. అయితే అది ఎప్పుడు జరుగుతుందో నాకు కూడా తెలియదు అని.. అయినా సూసైడ్ చేసుకుంటాడేమో అన్న పరిస్థితులు ఎదురు కావడంతో ఆయన్ని చాలా కాలం కాపాడుకున్నామని చెప్పుకొచ్చింది.

కానీ మేము లేని టైంలో ఆయన ఇలాంటి పని చేశాడని వివరించింది. తన కుటుంబంలో ఉన్న సైకలాజికల్ ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగానే తన భర్త చనిపోయాడని.. తాను గాని, అప్పులు గాని ఆయన మరణానికి కారణం కాద‌ని వివరించింది. ఆయన చనిపోవడంతో మూడు నెలలు షాక్ లో ఉన్నానని.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్ట్ తో దాని నుంచి బయటపడ్డాను అని వివరించింది. ఆ టైంలోనే సినిమాల్లో ఆఫర్స్ రావడం.. సినిమాలో నటిస్తూ బిజీ గా గడపడంతో దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాన‌ని.. అయినా ఇంటికి వెళ్తే జ్ఞాపకాలు వెంటాడేవని వివరించింది. లాక్ డౌన్ లో ఎంతో ఒంటరితనం ఫీలయ్యారని చెప్పుకొచ్చింది.