జబర్దస్త్‌కు సిరి హ‌న్మంత్ బైబై… ఆ షాక్ వెన‌క సీక్రెట్ చెప్పిన స్టార్ బ్యూటీ..!

బుల్లితెర బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ లో యాంకర్ గా సిరి హనుమంత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె యాంకరింగ్ మొదలుపెట్టి కొన్ని నెలలు అవుతుంది. ఇంతలోనే ఆమె జబర్దస్త్ గుడ్ బై చెప్పేస్తుందంటూ నెట్టింట కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ యూట్యూబర్‌గా, సీరియల్ ఆర్టిస్ట్ గాను ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంకా బిగ్‌బాస్ సీజన్ 5 లో సిరి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచింది. ప్రస్తుతం పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. మరో పక్క నటిగా కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ సీజన్ 7లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నర్ ఆఫ్ గా నిలిచాడు. ఇక వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

Intro | Siri Hanumanth, Indraja | Jabardasth | 30th November 2023 | ETV Telugu

అయితే ఆమె బిగ్‌బాస్‌ సీజన్ 5లో షణ్ముఖతో క్లోజ్ గా ఉన్నట్టు ఎన్నో రూమర్లు వినిపించిన.. శిరీ షణ్ముఖ్‌ క్లోజ్ గా ఉండడం వల్ల దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పిందంటూ ప్రచారాలు జరిగింది..అయినా సిరీ – శ్రీ‌హాన్‌ ప్రేమలో మాత్రం ఎటువంటి మార్పు జరగలేదు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం సిరి తన కెరీర్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటుంది. ప్రస్తుతం యాంకర్‌గా పలుషోలలో వ్యవహరిస్తుంది. ఇక ఇప్పటికే జబర్దస్త్ లో వరుసగా యాంకర్స్ మారుతూనే ఉన్నారు. గతంలో అనసూయ యాంకరింగ్ చేస్తుండగా.. ఆమె స్థానంలో సౌమ్యరావు ఎంట్రీ ఇచ్చింది. ఆమె కూడా కొంతకాలానికే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయింది. ఎందుకు తప్పుకుంది అనేదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఆమె స్థానంలో సిరి హనుమంత్ ఎంట్రీ ఇచ్చింది.

Intro | Siri Hanumanth, Indraja | Jabardasth | 1st February 2024 | ETV Telugu - YouTube

సిరి హనుమంత్‌ కూడా జబర్దస్త్ లో యాంకర్ గా మొదలుపెట్టి ఎన్నో నెలలు అవ్వడం లేదు.. ఇంతలోనే ఆమె జబర్దస్త్ గుడ్ బై చెప్పేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమో దీనికి కారణం. ఈ ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులలో అలాంటి అనుమానాలకు దారితీసాయి. ఈ షోలో కమెడియన్గా వ్యవహరిస్తున్న నూకరాజు సిరి దగ్గరకు వెళ్లి.. సిరి హనుమంత్.. జస్ట్ ఫర్ వన్ మంత్ అని కామెంట్స్ చేశాడు. అవి ఎవరో కావాలని చేసిన కామెంట్స్ అని సిరి వివ‌రించింది. అయితే మీరు కంటిన్యూ అవుతున్నారా.. అని నూక రాజు అడగగా అవును నేనే కంటిన్యూ అవుతా అంటూ క్లారిటీ ఇచ్చింది. సరే చూద్దాంలే అని నూకరాజు వెటకారంగా చెప్పడంతో ఆమె షోలో ఉంటుందా.. వెళ్లిపోతుందా అనే అంశంపై అనుమానాలు మరింతగా పెరిగాయి. సిరి హనుమంత్ కూడా ఎక్కువ కాలం జబర్దస్త్ యాంకర్ గా ఉండదేమో.. అనసూయ, సౌమ్య రావు లాగా గుడ్ బై చెప్పేసి తన కెరీర్ తాను చూసుకుంటుంది అంటూ పలువురు కామెంట్స్ వినిపిస్తున్నాయి. చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.