పేరుకే పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ ..అది చూస్తే మాత్రం రాజమౌళికి గజగజ వణుకు..పరుగో పరుగు..!

రాజమౌళి ..జక్కన్న.. దర్శక ధీరుడు ..వర్క్ పిచ్చోడు.. కంటెంట్ క్రియేటర్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నెన్నో ట్యాగ్లు .. కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకువచ్చిన ఓన్లీ లెజెండ్ డైరెక్టర్ . మగధీర సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్న రాజమౌళి బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించాడు . రికార్డ్స్ తిరగ రాశాడు . ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టాడు . ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు ఇండియాకు తీసుకొచ్చాడు .

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ ఒకే ఒక్క డైరెక్టర్ పేరే చెప్తారు . ఆయనే రాజమౌళి . మరి అలాంటి రాజమౌళికి బల్లి అంటే భయం అన్న విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . చాలామందికి కొన్ని ఎలర్జీస్ ఉంటాయి. కొందరికి చీమలు పడవు.. మరికొందరికి కాకోరోచ్స్ పడవు.. మరికొందరికి ఇన్సెక్ట్స్ పడవు చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇలాంటి సిచువేషన్స్ పేస్ చేస్తూ ఉంటారు .

అయితే ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళికి బల్లులు అంటే అస్సలు పడవట. గోడ మీద బల్లి చూస్తే పరుగో పరుగు ..ఆ రేంజ్ లో భయమట . షూటింగ్ సమయంలో కూడా ఒకటికి నాలుగు సార్లు బాగా క్లీన్ చేయిస్తారట . పాము ఉన్న సెట్స్ లో ఒప్పుకుంటాడేమో కానీ షూటింగ్ సెట్స్ లో బల్లి ఉంటే మాత్రం అస్సలు ఒప్పుకోడట . అంత భయమట రాజమౌళికి ఈ బల్లులు అంటే ..ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు..!!