నాగచైతన్య జాతకంలో అలాంటి గండం ఉందా? అందుకే నాగార్జున ఆ విషయంలో వెనుకడుగు వేస్తున్నాడా..?

ఇన్నాళ్లు అక్కినేని ఫ్యాన్స్ కి పెద్ద డౌట్ ఉండేది. ఎందుకు నాగర్జున నాగచైతన్యకు పెళ్లి చేయడం లేదు..? సమంతతో విడాకులు తీసుకున్నాడు ..? ఓకే అలా విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది రెండో పెళ్లి చేసుకుంటున్నారు .. మరి నాగార్జున ఎందుకు నాగచైతన్య విషయాన్ని పట్టించుకోవడం లేదు ..నాగచైతన్యకి కూడా పెళ్లి వయసు ఉంది కదా..? ఆయనకు భార్య ..పిల్లలు.. అక్కినేని ఫ్యామిలీకి వారసులు రావాలి అని అనుకుంటూ ఉంటారు కదా..? కానీ ఎందుకు నాగర్జున ఆ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ..??అనేది అభిమానులకు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది .

సోషల్ మీడియాలో తాజాగా దీనికి ఒక క్లారిటీ దొరికింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నాగచైతన్య జాతకంలో భారీ గండం ఉందట. అది వివాహ గండం . ఆయనకు పెళ్లిళ్లు అస్సలు కలిసి రావట . మొదటి పెళ్లి టైం లో కూడా జ్యోతిష్యులు అదే చెప్పారట. నాగచైతన్యకు పెళ్లి అనే బంధం అచ్చు రాదు అని.. కొన్ని కారణాల చేత ఆయన తీవ్ర ఇబ్బందులకు గురవ్వాల్సిన పరిస్థితి వస్తుందని లేనిపోని నిందలకు గురవ్వాలి అని ..ఆ కారణంగానే కొన్ని శాంతి పరిహార పూజలు చేయించి నాగచైతన్యకు పెళ్లి చేయించమన్నారట .

మొదటి నుంచి పూజ పునస్కారాలు పెద్దగా నమ్మని నాగచైతన్య ఆ విషయాన్ని లైట్ గా తీసుకున్నాడు . ఆ తర్వాత సమంతతో విభేదాలు కారణంగా విడిపోయారు. అయినా సరే ఇప్పటికి నాగచైతన్య పూజలు పునస్కారాలు చేయకుండా మొండితనంగా అలాగే ఉన్నాడు . ఆ పూజలు చేస్తే తప్పిస్తే నాగార్జున నాగచైతన్యకు పెళ్లి సంబంధం ఫిక్స్ చేయరు .. నాగచైతన్య ఎప్పుడు పూజలకు ఒప్పుకుంటాడో..? నాగార్జున ఎప్పుడు నాగచైతన్యకి పెళ్లి చేస్తాడో..? ఆ దేవుడికే తెలియాలి..!!