ఒక్క మెగా హీరో.. ఇద్దరు టాప్ డైరెక్టర్ల జీవితాలను నాశనం చేసిపడేసాడు. !

కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం తప్పులు చేసేస్తూ ఉంటాం. ఎంత పెద్ద టాప్ హీరో అయినా సరే కొన్నిసార్లు ఇలాంటి తప్పులు చేయక తప్పదు.. అలాంటి ఓ తప్పుచేసి మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు డైరెక్టర్లు జీవితాలను నాశనం చేసేసాడు అని ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఏ కథను అయినా నమ్మి ఆ డైరెక్టర్కు ఛాన్స్ ఇస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం మెగా ఫాన్స్ లో ఉంది .

అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు అనే చరిత్ర చెబుతుంది . అప్పటివరకు అసలు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని కొరటాలకు బిగ్ డిజాస్టర్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి . ఆచార్య సినిమా విషయంలో కొరటాలాది తప్పా..? చిరంజీవిది తప్పా..? అంటే 80% జనాలు చిరంజీవిది అంటారు . ఎందుకంటే కొరటాల రాసుకున్న స్క్రిప్ట్ ని మొత్తం చేంజ్ చేసి చిరంజీవి తనకు నచ్చిన విధంగా తెరకెక్కించుకున్నాడు .

అందుకే సినిమా డిజాస్టర్ గా మారింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అంతకంటే ముందే రామ్ చరణ్ ..వినయ విధేయ రామ సినిమా విషయంలో కూడా చిరంజీవి భారీ తప్పులు చేశాడు అంటూ వార్తలు వినిపించాయి . రామ్ చరణ్ క్యారెక్టర్ కి అలాంటి మాస్ స్టోరీ సెట్ అవ్వదు అంటూ చాలామంది సజెస్ట్ చేశారు . కానీ క్లాస్ హీరో గానే కాదు మాస్ హీరోగా కూడా సెటిల్ అవ్వాలి అని తన కొడుకు బాడీ లాంగ్వాజ్ కు సూట్ అవ్వని కధని చూస్ చేశాడు . వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ తర్వాత బోయపాటి ఎంత ట్రోలింగ్కి గురయ్యాడో మనకు తెలిసిందే. హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకున్నాడు . ఇలా మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు డైరెక్టర్లు జీవితాలను తనకు తెలియకుండానే నాశనం చేసేసాడు అంటూ అప్పట్లో జనాలు చర్చించుకున్నారు..!!