బిగ్ బ్రేకింగ్: ఆ సినిమా నుంచి తప్పుకున్న జాన్వి కపూర్.. మొత్తం పెంట పెంట చేసేసిందిగా..!?

జాన్వి కపూర్ .. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో .. ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న పేరు . మరి ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో ఆఫర్ అందుకోవడం అభిమానులకే కాదు .. సామాన్య జనాలకి కూడా ఆశ్చర్యం కలిగించింది. మిగతా హీరోయిన్స్ ఆఫర్లు లేక అల్లాడిపోతుంటే .. ఈ ముద్దుగుమ్మ చాక్లెట్ తిన్నంత ఈజీగా ఆఫర్స్ ఎలా పట్టేస్తుంది ..?? అంటూ బాగా చర్చించుకున్నారు జనాలు.

పాపం దిష్టి తగిలిందో ఏమో జాన్వి కపూర్ ఖాతాలో మంచి ఆఫర్ మిస్ అయ్యిందట. ఆమె క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పకుంట్లున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేవర సినిమాతో డెబ్యూ ఇస్తున్న జాన్వి .. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి .

అంతేకాదు విజయ్ దేవరకొండ-విజయ్ తిన్నూరు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ ప్రచారం జరిగింది . అయితే తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా నుంచి జాన్వి కపూర్ తప్పుకుందట. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ పాత్ర అని చెప్పి ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ పాత్రకు ఆమెను మూవ్ చేశారు అన్న కారణంగానే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!!