బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకొంటూ స్టార్ హీరోగా మారిన రణ్‌బీర్ కపూర్.. ఇటీవల సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెరకెక్కిన యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు. ఏకంగా రూ.900 కోట్ల కలెక్షన్‌లు రాబట్టిన ఈమూవీ ప్రొడ్యూసర్ కు కాసుల వర్షం కురిపించింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఇక రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఇద్దరు బాలీవుడ్ లోనే మోస్ట్ పాపులర్ కపుల్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ జంటకు రాహా అనే ఒక కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిన్న మొన్నటి వరకు ఆ పాప ఫోటోలు కూడా బయటకు రాకుండా ఎంతో జాగ్రత్త పడ్డా ఈ జంట ఇటీవల రాహ ఫోటోను బయటకు లీక్ చేయడంతో.. నెట్టింట ఆ పిక్స్ తెగ ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా కూతురు రాహీ కపూర్ కోసం కోట్ల విలువైన ఓ బంగ్లాని రన్బీర్ గిఫ్ట్ గా ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ముంబై బాంద్రా లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఈ ముగ్గురు కనిపించారు. దాదాపు రూ.250 కోట్ల విలువగల ఈ బాంగ్లాను కూతురు రాహా కపూర్ పేరు మీద రన్వీర్ నిర్మిస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో.. ఆహా ఒకే ఒక్క గిఫ్ట్ తో కూతురు రాభా కపూర్‌ను ఇండియాలోనే రిచెస్ట్ కిడ్ గా రణ్‌బీర్ మార్చేశాడే అంటూ.. రణ్‌బీర్ తన కూతురుకి బెస్ట్ ఫాదర్ అంటూ.. అది రణ్‌బీర్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.