అందరి ముందే హీరో చెంప చెల్లుమనిపించిన యాంకర్ శ్రీముఖి.. ఏం జరిగిందంటే( వీడియో)..?!

యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. అల్లరి రాములమ్మగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న శ్రీముఖి.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈమె బిగ్ బాస్ తర్వాత భారీ ఫాలోయింగ్ తో వరుస షోలలో హోస్ట్‌గా వ్యవహరిస్తూ గడుతుంది. ఓ పక్కన సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్కన యాంకర్‌గా దూసుకుపోతున్న శ్రీముఖి.. తాజాగా ఓ యంగ్‌ హీరోపై ఫైర్ అయింది. స్టేజ్ పై అందరి ముందే ఆ హీరో చెంప చెల్లుమనిపించింది. ఇంతకీ శ్రీ‌ముఖి యంగ్‌ హీరో చెంప చెల్లుమనిపించడానికి కారణం ఏంటో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. కేరింత మూవీ ఫేమ్ యంగ్ హీరో పార్వతీశం.. ప్రస్తుత మార్కెట్ మహాలక్ష్మి సినిమాలో బిజీగా గడుపుతున్నాడు.

విఎస్ ముఖేష్ డైరెక్షన్లో ప్రణికాన్వికా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇందులో హర్షవర్ధన్స‌ మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన‌ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉంటే మార్చి 29న‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జేరు అందుకున్నాయి. తాజాగా మేకర్స్ మహాలక్ష్మి అనే పేరు ఉన్న టాప్ 200 మెంబర్స్ కు మార్కెట్ మహాలక్ష్మి సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తామంటూ అనౌన్స్ చేశారు.

మరోసారి ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్ యాంకర్ శ్రీముఖి స్టేజిపై మాట్లాడుతుండగా.. పార్వతీశం స్టేజి పైకి వస్తాడు. శ్రీముఖి దగ్గరికి వెళ్లి మీరంటే నాకు చాలా ఇష్టం.. ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు శ్రీముఖి ఒక్కసారిగా ఆ హీరో చంపచెళ్ళుమ‌నిపించింది. ఏయ్.. మహాలక్ష్మి మార్కెట్ మహాలక్ష్మి మనతో మజాక్ లాడితే మంచిగా ఉండదు.. అంటూ డైలాగ్ వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే శ్రీముఖికి.. పార్వతీశం ప్రపోజ్ చేశాడు అని క్లియర్గా అర్థమౌతుంది.