“రామ్ చరణ్ తో సినిమానా..? చేయనంటే చేయను”.. తెగేసి చెప్పేసిన ప్రియమణి ..ఎందుకంటే..?

ఇండస్ట్రీలో ప్రియమణికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఆమె కంటూ స్పెషల్ గుర్తింపు ఉంది. అయితే కెరియర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కన్నా కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ లోనే ఓ రేంజ్ లో దుమ్ము దులిపేస్తూ వచ్చింది ఈ బ్యూటీ . ప్రెసెంట్ ఎక్కడ చూసినా ప్రియమణి పేరే మారుమ్రోగిపోతుంది .

ఇలాంటి క్రమంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని నెగిటివ్ వార్తలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రియమణికి సంబంధించిన ఒక నెగిటివ్ వార్త బాగా వైరల్ గా మారింది. ప్రియమణి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేసింది అన్న వార్త బాగా వైరల్ అవుతుంది. హీరోయిన్ ప్రియమణి తో ఐటెం సాంగ్ చేయించాలి అనుకున్నాడు సుకుమార్.. రంగస్థలం సినిమాలో జిగేలు రాణి పాత్రలో ముందుగా ప్రియమణిని ఊహించుకున్నారట మేకర్స్ .

అయితే ప్రియమణి ఆ పాత్రను చేయనంటే చేయను అంటూ రిజెక్ట్ చేసిందట. ఆశ్చర్యం ఏంటంటే ఆమె బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ సినిమాలో ఐటెం సాంగ్ మాత్రం చేసింది. మరి టాలీవుడ్ హీరో సినిమాలో ఎందుకు చేయలేదు..? అంటూ ఫ్యాన్స్ అప్పట్లో ఓ రేంజ్ లో ఏకేశారు. ఏమో రీజన్ ఆమెకే తెలియాలి .. టాలీవుడ్ హీరో ఐటమ్ సాంగ్ చేస్తే మంచి పాత్రలు ఇవ్వరు అనుకున్నింది ఏమో .. ఫైనల్లి ఈ బ్యూటీ రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేసి మెగా ఫ్యాన్స్ చేత ట్రోలింగ్ కూడా చేయించుకుంది..!!