పుష్ప 2 లో శ్రీవల్లి లుక్ ..ఆ హీరో భార్య ని చూసి కాపీ కొట్టారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పుష్ప2 ది రూల్. గతంలో ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన పుష్ప ది రైజ్ సినిమాకి ఇది సీక్వెల్ గా రాబోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కల డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ఈ సినిమాను తనదైన స్టైల్ లో మాస్ యాంగిల్ లో డైరెక్టర్ చేశాడు .

పుష్ప వన్ సినిమా ఎంత క్రేజీ హిట్ అందుకుందో మనకు తెలిసిందే. పుష్ప2 తో డబల్ హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు సుకుమార్. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ సోషల్ మీడియాలో లీకై ఎలా ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తుందో మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

ఎర్రటి పట్టుచీరలో ఒంటినిండా నగలు వేసుకున్న రష్మిక మందన్నా.. అచ్చం మహారాణిలా కనిపించింది . దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే ఈ పిక్చర్స్ చూస్తూ ఉంటే ఇండస్ట్రీలో స్టార్ హీరో భార్య లుక్స్ కి కాపీ చేసినట్లు ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో భార్య .. కూడా ఎక్కడికి వెళ్లినా సరే ఇలాగే పద్ధతిగా బాగా భారీ స్థాయిలో నగలు వేసుకొని ..చక్కగా మహాలక్ష్మిలా కనిపిస్తుంది అని.. అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు . బహుశా సుకుమార్ ఆ హీరో భార్యని చూసే ఇలా లుక్స్ కాపీ కొట్టారా ..? అన్న విషయం కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తానికి ఒక్క వీడియోతో పుష్ప2 పై క్రేజీ హైప్ పెంచేశాడు . చూద్దాం మరి ఏం జరగబోతుందో..???