చిరు బ్యూటీ పై కన్నేసిన వెంకీ మామ.. మరి ఆమె ఒప్పుకుంటుందా..

ప్ర‌స్తుతం సౌత్ సీనియర్ స్టార్ హీరోల‌ అందరికి అనుష్క, త్రిష, నయనతార మంచి ఆప్షన్లుగా నిలిచారు. అయితే కుర్ర భామలతో రొమాన్స్‌ సెట్ కానీ 50+ హీరోలంతా తమ ఏజ్ కు తగ్గట్టుగా జోడిలను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. లియో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన త్రిష ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఈ క్రమంలో చిరంజీవి విశ్వంభరా సినిమాకు అమ్మే సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. బింబిసారా ఫేమ్ మ‌ల్లీడి వ‌శిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోషియా ఫాంటసీ అడ్వెంచర్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష కథానాయకగా నటించనుంది. ఇక గతంలో చీరు – త్రిష కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ చిరుతో జత కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఆమె చిరంజీవి సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటుంది. ఇలాంటి క్రమంలో మరో టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో త్రిష కు ఆఫర్ వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సెస్ఫుల్ కాంబినేషన్లో మరో మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందించిన అనిల్.. దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్ తో మరో సినిమా తెర‌కెక్కించ‌నున్నాడు. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనరట.

కాగా దాదాపు స్టోరి రెడీ అయిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా త్రిష అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. దీనిపై త్రిషను అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. ఇక వెంకీ సరసన త్రిష నటించినందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. అయితే టాలీవుడ్ లోనే త్రిష – వెంకీ మామ మోస్ట్ సక్సెస్ఫుల్ పెయిర్ అన్న పేరు కూడా ఉంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, నమో వెంకటేశా, బాడీగార్డ్ మూడు సినిమాలు హ్యాట్రిక్ సక్సెస్ లో అందుకున్నాయి. దీంతో మరోసారి వీరి కాంబోలో సినిమా తెరకెక్కితే బ్లాక్ బస్టర్ పక్క అంటూ ఫ్యాన్స్ త‌మ అభిప్రాయాని వ్య‌క్తం చేస్తున్నారు.