బిగ్ బ్రేకింగ్.. గంజాయితో పోలీసుల‌కు పట్టుబడ్డ బిగ్‌బాస్ షణ్ముఖ్.. షాక్ లో ఫ్యాన్స్..

ప్రముఖ యూట్యూబ‌ర్.. బిగ్ బాస్ ఫేమ్ ష‌ణ్ముఖ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్గా క్రేజ్ ద‌క్కించుకున్న ష‌ణ్ముఖ్ బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. పలు షార్ట్ ఫిలిం లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. త‌న‌ ఫ్లాట్లో గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ యువ‌తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్ వద్దకు వెళ్లారు పోలీసులు.

అక్కడ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ కనిపించడంతో.. సంపత్ వినయ్‌తో పాటు ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌ను కూడా నర్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే షణ్ముఖ్ సోదరుడు.. సంపత్ వినయ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ అమ్మాయితో ప‌దేళ్ళ‌గా ప్రేమాయ‌ణం నడుపుతున్నాడు. మూడేళ్ళ క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న సంపత్.. ఆ తర్వాత ఆమెను దూరం పెట్టాడు. 20 రోజుల క్రితం వేరే యూవ‌తని పెళ్లి చేసుకున్ని ఆమెను మోసం చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న సంపత్ లవర్ పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేసి మరొకరు వివాహం చేసుకున్నాడని ఆమె ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సంపత్ విన‌య్‌ను అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్‌ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు ఆ యువ‌తి కూడా అక్కడకు వెళ్ళింది. ఇంట్లోకి వెళ్లి చూడగా షణ్ముఖ్ ఒక్కడే గంజాయి సేవిస్తూ కనిపించాడు. అతని వద్ద గంజాయి లభించడంతో పోలీసులు ష‌ణ్ముఖ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ టైంలో సదరు యువతితో షణ్ముఖ్‌ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.