తన భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్ ని వెల్లడించిన స్టార్ హీరోయిన్..!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో మరియు హీరోయిన్ ప్రేమించుకుంటూ పెళ్లిళ్లు చేసుకునే అంశం కామన్ అయిపోయింది. అదేవిధంగా పెళ్లికి ముందే తమకి కాబోయే హస్బెండ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ కొందరు హీరోయిన్స్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా రష్మిక మందన సైతం తనకి కాబోయే భర్త పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హీట్ ని అందుకుంది. ఇక కెరీర్ పరంగా చాలా బిజీ అయిపోయింది రష్మిక. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమాని చేసిన పోస్ట్ కు రష్మిక రెస్పాండ్ అయింది. ఆమెకి కాబోయే భర్త ఎలా ఉండాలి అంటూ ఓ అభిమాని అడగగా.. తనకు కాబోయే భర్త మరింత స్టైల్ గా ఉండాలి అని అదే విధంగా తన భర్త VD లా ఉండాలి అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా ఎల్లప్పుడూ తనని సపోర్ట్ చేయాలని వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.