వెంకీ 76వ మూవీ అనౌన్స్మెంట్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే..!

కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో రాణిస్తున్న విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇటీవలే సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ మూవీ అనంతరం వెంకటేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అంటూ అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈయన తదుపరి చిత్రం త్రివిక్రమ్తో వర్క్ చేసేందుకు సిద్ధమయ్యాడంటూ ఆ మధ్యకాలంలో అనేక పుకార్లు వెదజల్లాయి. కానీ ప్రస్తుతం అనిల్ రావిపూడి తో వెంకటేష్ మరోసారి సినిమా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాని దిల్ రాజు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ మహాశివరాత్రి రోజున రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త చూసిన పలువురు.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే పక్క ఫన్నే. మన టాలీవుడ్ లో వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ చాలా స్పెషల్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.