బాలయ్యతో జతకట్టనున్న తమన్న.. ఏ సినిమా అంటే..!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనున్నట్లు గత కొంతకాలంగా అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది.

ఆ స్టార్ హీరోయిన్ మరెవ్వరో కాదు మిల్కీ బ్యూటీ తమన్న. ఇటీవల జైలర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి భారీ విజయాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలయ్య సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య మరియు తమన్నాల మధ్య సాంగ్ అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం.

ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా త్రిలింగ ఉండనుందట. అన్నట్లు ఈ సినిమాలో బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదు అని.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ డ్రామా అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ నటిస్తుంది అనగానే ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.