ఒకప్పుడు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ అక్ష తాజాగా పెళ్లి పీటలెక్కింది. అక్ష అనగానే గుర్తుపట్టకపోవచ్చు. రామ్ కందిరీగ సినిమాలో హీరోయిన్ అనగానే ఆమె ఫేస్ టక్కున రివీల్ అవుతుంది. మళయాళ బ్యూటీ అక్ష 2004 లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ముసాఫిర్ సినిమాలో నటించిన ఈమె.. 2007లో గోల్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2008లో పాన్ ఇండియన్ స్టార్ హీరో నిఖిల్ సరసన యువత సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించింది. రైడ్, అది నువ్వే, కందిరీగ, శత్రువు, రయ్ రయ్, బెంగాల్ టైగర్, మెంటల్ పోలీస్, డిక్టేటర్, రాధా ఇలా వరుస సినిమాల్లో నటించి మెప్పించింది.
అయితే 2017 తరువాత టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో.. జమత్రా, కాట్ మెండ్ కనెక్షన్, రపు చక్కర్ లాంటి వెబ్ సిరీస్ లో మెప్పించింది. అదే సమయంలో ఇండస్ట్రీలోనే ఓ సినిమా ఆటోగ్రాఫర్‌గా చేస్తున్న కుర్రాడితో ఏడడుగులు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. ఈ క్రమంలో అందరూ ఆ హీరోయిన్ కు విషెస్ తెలియజేస్తున్నారు.
ఇంతకీ ఆ సినిమాటోగ్రాఫర్ ఎవరు.. వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. ఈమె వరుస వెబ్ సిరీస్లలో నటిస్తున్న సమయంలో ఆ సిరీస్‌లకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన కౌశల్ తో మంచి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో గతేడాది నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరుపుకుంది. తాజాగా ఫిబ్రవరి 26న వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఈ ఫోటోలు నెటింట ట్రెండ్ అవ్వడంతో పలువురు సెలబ్రిటీస్ తో పాటు ఆమె అభిమానులు అక్షకు విషెస్ తెలియజేస్తున్నారు.