నాని కొడుకు అర్జున్ టాలెంట్ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. తండ్రి కి లైఫ్ లాంగ్ గుర్తుండే గిఫ్ట్ ఇచ్చాడుగా..

నాచురల్ స్టార్ నానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న నాని తన నటనతో పక్కింటి కుర్రాడిలా ప్రేక్షకులను మెప్పించాడు. మాస్ అయినా, రొమాంటిక్ కామెడీ అయినా నాని తనదైన స్టైల్ తో ఆకట్టుకుంటాడు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగిన సంఘటన తెలిసిందే. ఇందులో భాగంగా నాని తన అప్కమింగ్ మూవీస్ అప్డేట్స్ షేర్ చేసి అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.

అయితే నానికి అతని కొడుకు అంతకంటే గొప్ప గిఫ్ట్ ప్రెజెంట్ చేశాడు. లైఫ్ లాంగ్ నాని కి గుర్తుండి పోయేలా తన అద్భుతమైన టాలెంట్ చూపించాడు. ఫాన్స్ కూడా అర్జున్ టాలెంట్ కు ఫిదా అవుతున్నారు. ఇంతకీ నాని పుట్టినరోజుకు కొడుకు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో.. ఏ విధంగా తండ్రి బర్త్డే సెలబ్రేట్ చేసాడు.. ఒకసారి చూద్దాం. ఈ ఏడాది నాని పుట్టినరోజు కుటుంబంతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ నాని భార్య అంజలి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందులో నాని కొడుకు అర్జున్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వీడియోలో అర్జున్ మాట్లాడుతున్న నాకు ఇష్టమైన మా నాన్నకు మ్యూజిక్ అంటే ప్రాణం.

అందుకే ఈ బర్త్ డే కి గిఫ్ట్ గా తనకు నచ్చిన మ్యూజిక్ ఇస్తున్న అంటూ పియానో పై మ్యూజిక్ ని ప్లే చేశాడు. నానిని పక్కన కూర్చోబెట్టుకుని అర్జున్ పియానో ప్లే చేస్తుంటే కొడుకుని చూసి మురిసిపోయాడు నాని. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఫాన్స్ అంత ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ వీడియోకి అదాశ‌ర్మా, కీర్తి సురేష్ లాంటి సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు. ఇక నాని ప్రస్తుతం నటిస్తున్న సరిపోదా శనివారం గ్లింప్స్ నాని పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్.

 

View this post on Instagram

 

A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy)