ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ హీరోతో సినిమా చేయనని తెగేసి చెప్పిన నయనతార.. కారణం అదేనా..?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది నయనతార. కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస‌ సినిమాలో నటిస్తూంది. ఈ ముద్దుగుమ్మ లేడి వారియంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. లేడీ సూపర్ స్టార్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న నయన్‌.. తమిళ్లోనే కాదు తెలుగు, కన్నడ‌, మలయాళ భాషల్లోనూ దాదాపు స్టార్ హీరోల అందరి స‌ర‌స‌న నటించి తనదైన ముద్ర వేసుకుంది. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ 30 దాటితే అయిపోతుంది. 35కు మించి వారి కెరీర్ లైమ్ లైట్‌లో ఉండడం అనేది చాలా క‌ష్టం. కానీ నయనతార నాలుగు పదుల వయసులోనూ రెట్టింపు క్రేజ్‌తో దూసుకుపోతుంది. అలాగే సౌత్ ఇండస్ట్రీలో అందరికంటే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్గా రికార్డును సృష్టించింది. అయితే తాజాగా నయ‌న్‌కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్‌ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆమెకు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామంటూ.. హీరోయిన్ గా ఓ మంచి అవకాశం వచ్చిన ఆ సినిమాలో రిజెక్ట్ చేసిందట. 100 కోట్లు కాదు నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించనని తెగేసి చెప్పింద‌ట‌. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ స్టోరీ ఏంటో.. ఒకసారి చూద్దాం. ఆ సినిమా మరేదో కాదు తమిళ్ మూవీ ది లెజెండ్. ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం న‌య‌న్‌కు వ‌చ్చింద‌ట‌. అయితే ఈమె ఆ సినిమా రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. 50 ఏళ్లు దాటిన తర్వాత శరవణ‌న్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బిజినెస్‌మ్యాన్‌గా కోట్లు అర్జించిన ఆయన.. 2002లో లెజెండ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కేవలం తమిళనాడు కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కింది. ఆయన చేసిన ఈ సినిమాలో ఊర్వశి రౌతెల హీరోయిన్గా నటించింది. వివేక్‌, యోగి బాబు, విజయ్ కుమార్, ప్రభు, నాజర్ లాంటి ఎంతోమంది భారీ తారాగణం నటించింది.

ఇక ఈ సినిమా విషయంలో శ‌ర‌వ‌ణ‌న్‌ ఎన్నో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సినిమాను ఎవరు చూసినా చూడకపోయినా శరవణ‌న్‌ మాత్రం భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. దేశవ్యాప్తంగా ఇతని పేరు అప్పట్లో మారుమోగిపోయింది. అయితే సినిమాల్లో హీరోయిన్గా మొదట ఎంతమందిని అడిగినా శర‌వ‌ణ‌న్‌ పక్కన నటించమని చెప్పేసారని.. దీంతో ఊర్వశికి రూ.20 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఈ సినిమాలో పెట్టుకున్నట్లు టాక్ వినిపించింది. ఈ సినిమాకు హీరోయిన్గా మొదటి నయనతారను తీసుకోవాలని గట్టిగా ప్రయత్నించాడట.. ఆమె ఇంటికి తన మేనేజర్లు రోజు పంపి మరి పారితోషికం అత్యధికంగా ఇస్తామని ఆఫర్ చేసేవాడట. కానీ నయన్ మాత్రం రూ.100 కోట్లు ఇచ్చిన ఇంకెన్ని కోట్లు ఇచ్చిన నేను అత‌ని సినిమాలో నటించన‌ని తెగేసి చెప్పిందట. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట తెగ వైరల్ అవుతుంది.