సినిమాల్లోకి రాకముందు బొద్దుగా.. ఇప్పుడు సన్నని మెరుపుతీగ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో తమ అభిమాన స్టార్ హీరో, హీరోయిన్‌ల‌.. లైఫ్ స్టైల్, చిన్ననాటి ఫోటోలు ఇలా వారికి సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా ప్రేక్షకులు దాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. క్షణాల్లో వైరల్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుత ఓ తెలుగు హీరోయిన్ పాత ఫోటో నెటింట‌ తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం నాజుకుసొగ‌సుల‌తో మెరుపు తీగ‌లా మెరిసిపోతు.. ఫిట్నెస్ ఫ్రీక్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. పాత ఫోటోలో మాత్రం చాలా బొద్దుగా.. అసలు గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఈ ఫోటో చూసిన వారంతా అప్పటికి, ఇప్పటికీ అంత చేంజ్ ఎలా వచ్చింది.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ పై ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టారా.. ?

നടിയാകാന്‍ വേണ്ടിയല്ല താന്‍ തടി കുറച്ചതെന്ന് കല്യാണി പ്രിയദര്‍ശന്‍ | Kalyani Priyadarshan opens about her old look - Malayalam Filmibeat

ఆమె టాలీవుడ్ టైర్ 2 హీరోలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చ‌కుంది. తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికీ గుర్తు రాలేదా.. అయితే మేమే చెప్పేస్తాంలెండి. ఆమె అఖిల్.. హలో సినిమాలో హీరోయిన్గా నటించిన కళ్యాణి ప్రియదర్శన్. ఈ సినిమాతో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహ‌రీ సినిమాలో నటించినా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాకపోవడంతో.. తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె సొంత ఊరికి వెళ్ళిపోయింది. మలయాళంలో వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా మారింది.

Chitralahari's pre-release event to be held on that day?

ఇప్పటివరకు ఆమె మలయాళ స్టార్ హీరోస్ అందరితోను నటించింది. అయితే తెలుగులో కూడా స్ట్రెయిట్ సినిమాల‌లో నటించకపోయిన ఓటీటీ డబ్బింగ్ సినిమాల్లో చాలా వాటిలో మెరిసింది. ఇక ఇప్పుడు మంచి ఫిజిక్‌తో నాజుక్కుగా కనిపిస్తూ మెరుపుతీగల మెరుస్తున్న కళ్యాణి ప్రియదర్శన్.. సినిమాల్లోకి రాకముందు బొద్దుగా ఉండేది. అప్పటి ఫోటో, ఇప్పటి ఫోటో పక్కన పెట్టి చూస్తే అసలు ఆ ఇద్దరు ఒక్కరేనా అనే సందేహం అందరిలోనూ వస్తుంది. ఇకపోతే కళ్యాణి తల్లి, తండ్రులు ఇద్దరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కావడం విశేషం. తండ్రి ప్రియదర్శన్‌.. ప్రముఖ డైరెక్టర్ కాగా, తల్లి లీజి ఒకప్పటి హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలో నటించింది. కళ్యాణి కూడా తల్లిదండ్రుల అడుగుజాడలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్గా దూసుకుపోతుంది.