సాధారణంగా పల్లెటూరిలో.. పొలాల్లో ప్రయాణించేటప్పుడు ఎన్నో గడ్డి మొక్కలను మనం చూస్తూ ఉంటాం. అవన్నీ పిచ్చి మొక్కలని మనం భావిస్తాం. కానీ అలా కనిపించే పిచ్చి మొక్కల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగిన అద్భుతమైన మొక్కలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ పైన ఫోటోలో చూపిస్తున్న ఆస్తమాన ఆకు కూడా అదే కోవలోకి వస్తుంది. చూడడానికి గుంటగలగరాకు లాగా పెద్ద పెద్ద ఆకులను కలిగి ఉంటుంది. చూడగానే మనం గుర్తించవచ్చు. అయితే ఈ ఆస్తమాన ఆకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఒకసారి చూద్దాం.
ఈ ఆకుని దూది గ్రాస్ కూడా అంటారట. ఎవరైతే శ్వాస కోస సమస్య, ఎలర్జీ, ఆస్తమా, ఉబ్బసం లాంటి సమస్యలతో ఇబ్బంది పడతారో.. వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. చికిత్స కోసం ఈ ఆకులు ముందుగా తీసుకుని శుభ్రం చేసి నీడలో రెండు రోజులు ఆరనివ్వాలి. ఆ తర్వాత ఏ ఆకులను మిక్సీ పట్టుకొని పొడిలా చేసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే.. అవసరం వచ్చేటప్పుడు వాడుకోవచ్చు. ఇంతకీ ఈ పొడిని ఎలా ఉపయోగించాలంటే.. ఈ ఆస్తమాకు పొడిని కరక్కాయపొడి, తేనే కలిపి చూర్ణంలా చేసుకుని మింగాలి. శ్వాసకోశ సమస్యలు, ఆయాసం, ఉబ్బసం సమస్యలతో బాధపడేవారు వెంటనే ఇది చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి సమస్యలైనా సులభంగా తగ్గుతాయి.
ఇది చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు ఎవరైనా వాడవచ్చు. వయసుకు తగ్గట్టుగా ఓ సరైన మోతాదులో తీసుకోవడం మంచిది. అంతే కాదు పేను కొరుకుడు సమస్యతో బాధపడే వారికి కూడా ఈ ఆస్తమాన ఆకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆకుతో గన్నేరు ఆకులు కలిపి బాగా దంచి పేను కొరికిన ప్రదేశంలో వారానికి రెండుసార్లు రాసుకుంటే.. ఈ సమస్య ఈజీగా తగ్గుతుందట. అలాగే డైజేషన్ ప్రాబ్లమ్స్ కి కూడా ఈ ఆకు పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పొడిని చిటికెడు మోతాదులో తీసుకోవడం వల్ల అజితి, గ్యాస్, మలబద్దకం సమస్యలు తలెత్తవు. కనుక ఎప్పుడైనా మీరు వెళ్లే ప్రదేశంలో ఇలాంటి ఆకు కనిపిస్తే దానిని పైన చెప్పిన విధంగా చేసుకొని వాడేందుకు ప్రయత్నించండి.