టాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్న యాంకర్ ప్రదీప్.. పెళ్లి కూడా..

బుల్లితెర యాంకర్ ప్రదీప్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ప్రదీప్ యాంకరింగ్, కామెడీ టైమింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే పలు షోల‌లో హోస్ట్ గా చేస్తూ ప్రేక్షకుల భారీ పాపులారిటి అందుకున్న ప్రదీప్.. పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ ఆ సినిమా వర్కౌట్ కాకపోవడంతో తర్వాత ఏ సినిమాల్లోను నటించలేదు.

ప్రస్తుతం టీవీ షోలో సందడి చేస్తూ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈయన.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నాడు. అయితే నాలుగు పదుల వయసు దాటిన ఇంకా ప్రదీప్ పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న ప్రదీప్.. పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ప్రదీప్ ఈ వార్తలపై స్పందించకపోవడంతో కొన్నాళ్లు బ్రేక్ పడినా.. ఇటీవల ప్రదీప్ షేర్ చేసిన ఫోటోల కారణంగా ప్రదీప్ పెళ్లి మళ్లీ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ అయింది.

తాజాగా ప్రదీప్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంద. ప్రదీప్ టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. తొందర్లోనే ఆమెను వివాహం కూడా చేసుకోనున్నాడ‌ట‌. అయితే ఆ హీరోయిన్ ఎవరు.. ఏ సినిమాలు న‌టించింది అనే విషయాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ కాస్త లేట్ అయిన హీరోయిన్ నే పట్టావా ప్ర‌దీప్ అన్నా అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు నెటిజ‌న్స్‌.