ఓరి దేవుడోయ్..అల్లు అర్జున్ మామూలోడు కాదు.. ఇంటర్నేషనల్ వేదికపై ఏం చేశాడో చూడండి..!

అల్లు అర్జున్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. పుష్ప సినిమా అభిమానులను హ్యూజ్రేంజ్ లో ఆకట్టుకుంది . పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు పబ్లిసిటీ పాపులారిటీ పెరిగేలా చేసింది. ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమాతో ఇండియాకి మరో ఆస్కార్ కన్ఫామ్ అంటున్నారు జనాలు .

కాగా రీసెంట్గా బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో పుష్ప సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేసినట్లు సమాచారం . అనంతరం అల్లు అర్జున్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతూ గూస్బంస్ వచ్చే విధంగా అక్కడ ఉండేవాళ్ళకి స్పీచ్ ఇచ్చారు. అక్కడ ఫిలిం ఫెస్టివల్ ప్రతినిధులు అర్జున్ అల్లు అర్జున్ కి సన్మానం చేశారు. బన్నీకి బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ తరఫున చిరు కానుక కూడా అందించారు . అల్లు అర్జున్ అధికారికంగా ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేస్తూ ఉండడంతో కేంద్రంకు చెందిన నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ఫోటోలు అధికారికంగా పోస్ట్ చేసింది.

కాగా ఈ వేదికపై అల్లు అర్జున్ బిహేవ్ చేసిన పద్ధతి ..నడుచుకున్న తీరు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎవరైనా సరే అంత పెద్ద పాన్ ఇండియా హీరో స్దాయి ..ఆ పాపులారిటీ దక్కించుకున్నాక అంతటి గౌరవం అందుకున్నాక ..హెడ్ వెయిట్ చూపిస్తారు. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా పద్ధతిగా తెలుగు సాంప్రదాయాలను గౌరవిస్తూ చక్కగా తన సినిమా గురించి ఇండియన్ సినిమా గురించి ఓ రేంజ్ లో పొగిడేసారు. అల్లు అర్జున్ బిహేవియర్ కి జనాలు ఫిదా అయిపోయారు. అక్కడ ఉన్నవారు కూడా తెలుగు సాంప్రదాయం అంటే ఇదే ఇండియన్ కల్చర్ ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!