“అది కూడా ఆడదానిలో ఓ భాగమేగా నచ్చితే తప్పేంటి..?”.. సందీప్ మామ ఊర నాటు మాస్ ఆన్సర్ . !

సందీప్ రెడ్డి వంగ .. మాస్ అని తెలుసు .. కానీ ఇంత ఊర నాటు మాస్.. వామ్మో అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. సందీప్ రెడ్డివంగా మొదట అర్జున్ రెడ్డితో ఆ తర్వాత యానిమల్ సినిమాతో సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేశాడు. అర్జున్ రెడ్డి సినిమాలో ఎంత బోల్డ్ పెర్ఫార్మన్స్ క్రియేట్ చేసి విజయ్ దేవరకొండ కెరియర్ ని టాప్ లో పెట్టాడో. ఇప్పుడు యానిమల్ సినిమాతో రన్బీర్ కపూర్ ని సైతం అంతే టాప్ లో పెట్టాడు . మరీ ముఖ్యంగా యానిమల్ సినిమాలో చాక్లెట్ బాయ్ లాంటి రన్బీర్ కపూర్ చేత బోల్డ్ పర్ఫార్మెన్స్ తో పాటు బూతు డైలాగులు చెప్పించి బాలీవుడ్ మీడియాని షేక్ చేసి పడేసాడు .

ఈ సినిమాలో రన్బీర్ కపూర్ రష్మిక తో ఓ డైలాగ్ చెప్తాడు . ” నీ పెల్విస్ బాగుంది .. నీకు హెల్తీ బేబీస్ పుడతారు” అంటూ వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే ఓ డైలాగ్ ను రణబీర్ నోట చెప్పిస్తాడు. అయితే ఈ డైలాగు అప్పట్లో థియేటర్స్ లో చాలా సెన్సేషన్ గా మారింది. అప్పటివరకు ఇలాంటి డైలాగులు ఎవరు రాయకపోవడం గమనార్హం. అయితే సెన్సార్ సభ్యులు కూడా ఈ డైలాగును కట్ చేయాలని చూశారట .

కానీ సందీప్ రెడ్డి వంగానే పట్టుబట్టి గొడవ చేసి మరి ఆ డైలాగును సినిమాలో నుంచి కట్ చేయకుండా ఉంచారట. “ముఖం బాగుంది ..కళ్ళు బాగున్నాయి.. పెదాలు బాగున్నాయి ముక్కు బాగుంది అని అమ్మాయి నచ్చితే చెప్తాంగా.. మరి నీ పెల్వీస్ బాగుంది అని చెప్తే తప్పేంటి ..? అది కూడా అమ్మాయిలో పార్టే గా” అంటూ సెన్సార్ సభ్యులకు షాక్ ఇచ్చాడట సందీప్ రెడ్డివంగా “. అంతేకాదు సగం మంది జనాలకు పెల్వీస్ అంటే తెలియదు మీరు భయపడకండి అంటూ ఆయన ఇష్టంగా రాసుకున్న డైలాగ్ ను క్రాప్ చేయకుండా అలాగే ఉంచేలా సెన్సార్ సభ్యులను మాయ చేసాడట సందీప్ రెడ్డివంగా..!!