రెండో పెళ్లికి సిద్ధమైన సిద్ధార్థ్, అదితి.. ప్రేమను అఫీషియల్ చేసిన స్టార్ కపుల్..

మహాసముద్రం సినిమాతో జంటగా నటించారు సిద్ధార్థ్‌, అదితి. ఈ సినిమాతో వీరిద్దరి మధ్యన ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందిని, డేటింగ్ లో ఉన్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక మహాసముద్రం సినిమాలో వీరితో కలిసి నటించిన హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు కూడా వీరిద్దరూ జంటగా రావడంతో త్వరలోనే వీరిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వినిపించాయి. ఇక తర్వాత నుంచి వీరిద్దరూ అందరికీ తెలిసిన ఓపెన్ మేటరేగా అనుకున్నారో.. మరేమో కానీ బయట జంటగా అన్నిచోట్లకు తిరిగేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో వీరు పెట్టే ఫోటోలకు, వీడియోలకు అసలు కండిషన్‌లు ఉండడం లేదు. ఇటీవల సిద్ధార్థ్‌ నటించిన చిన్న మూవీ బాలీవుడ్ ప్రీమియర్‌కి అదితి దగ్గరుండి అన్ని చూసుకుంది. అంతేకాదు వీరిద్దరిలో ఎవరి పుట్టినరోజు అయిన, స్పెషల్ డేస్ అయినా.. ఒకరినొకరు చాలా స్పెషల్ గా విష్ చేసుకుంటూ ఉంటారు. దీంతో సోషల్ మీడియా ఫాలోవర్స్ అంతా వీరి రిలేషన్ లో ఉన్నారని చెప్పకపోయినా ఈ జంట రిలేషన్ పై క్లారిటీతో ఉన్నారు. ఇక తాజాగా న్యూ ఇయర్ కి విదేశాల్లో ఇద్దరూ కలిసి క్లోజ్ గా దిగిన ఫోటోలు అదితీ రావు హైదారి షేర్ చేస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేసింది.

దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇలా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని అధికారికంగా పోస్ట్ చేయడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా.. ఆ విషయాన్ని పోస్ట్ ద్వారా తెలియజేయాలనుకున్నారా..? వీరి లవ్ ను అని అఫీషియల్ గా ప్రకటిస్తున్నారా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే సిద్ధార్థ్ కు, కియార‌కు ఇద్దరికీ వేరొక‌రితో మొదటి వివాహం జరిగి మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అవుతుంది.