ప్రభాస్ కెరీర్ లోనే బాహుబలికి మించిన రికార్డ్.. 9 థియేటర్స్ లో 100 రోజులు ఆడిన పరమ డిజాస్టర్ మూవీ ఇదే..!

ప్రభాస్.. ఈ పేరు చెప్తుంటేనే తెలియకుండా వైబ్రేషన్స్ వచ్చేస్తుంటాయి . సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అనే అంతలా తన పేరుకి పాపులారిటీ సంపాదించుకున్నాడు . రీసెంట్గా సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమాతో అంతకుమించిన బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు . కాగా రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది.

ప్రభాస్ కెరియర్ లోనే డిజాస్టర్ మూవీ గా నిలిచిన “మున్నా” సినిమా ఏకంగా తొమ్మిది థియేటర్స్ లో వంద రోజులు ఆడిన విషయాన్ని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . సినిమా హిట్ ప్లాప్ అన్న టాక్ తో సంబంధం లేకుండా ..రెబల్ ఫ్యాన్స్ ఏమైనా చేయగలరు అని ఈ సినిమానే ప్రూవ్ చేసింది . ఈ సినిమాను దిల్ రాజు చాలా ఇష్టంగా నిర్మించారు . ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది .ఈ సినిమాలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ కథ పెద్దగా నచ్చకపోవడం తో జనాలు ఫ్లాప్ చేసి పెట్టారు.

కాగా త్వరలోనే ప్రభాస్ నటించిన కల్కి సినిమా రిలీజ్ అవ్వబోతుంది . ఆ తర్వాత మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన రాజా డీలక్స్ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధమవుతుంది . అంతేకాదు ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఓ ప్రతిష్టాత్మకమైన సినిమాలో నటించబోతున్నాడు. దీనికి స్పిరిట్ అంటూ కూడా పేరు పెట్టేశారు సందీప్ రెడ్డివంగా..!!