మహేష్ కోసం ఆ హీరోయిన్ పై కన్నేసిన జక్కన్న.. ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..?!

2023కు బై బై చెప్పి.. 2024 లో అప్పుడే అడుగు పెట్టేసాం. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి ఎంతో కీలకంగా చెప్పాలి. ఎందుకంటే ఈ ఇయర్‌లోనే టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ కానున్నాయి. గతేడాది రిలీజ్ అయిన సినిమాల్లో హిట్ల కన్నా, ఫ్లాప్‌లే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ ఈ ఏడాది రిలీజ్ అయ్యే మూవీస్ పై మంచి అంచనాలు పెంచుకున్నారు.

ఇక టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ కాంబోలో అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా తుర‌కెక్క‌బోతున్న సినిమా కోసం కూడా మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ సినీ ప్రియులంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ న్యూ ఇయర్‌లో అయినా మహేష్ – జక్కన్న సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్‌లు ఏమైనా వస్తాయేమో అని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ అదిరిపోయే ఆపరేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మార్చిలో ఈ మూవీ పూజా కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయని దీనికి నిర్మాతలు గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

సినిమా స్టోరీ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా సాగుతోందట. విజయేంద్ర‌ ప్రసాద్ రాసిన ఈ స్టోరీలో హీరోయిన్ రోల్ కోసం.. రాజమౌళి మాస్టర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో దర్శకధీరుడు రాజమౌళి వెతికి వెతికి బాలీవుడ్ స్టార్ బ్యూటీ అయిన ప్రియాంకను సెలెక్ట్ చేశాడట. ఇప్పటికే ఆమెను కలిసి రెండు సార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఇక జక్కన్న సినిమా అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని వారు ఎవరుంటారు.. ప్రియాంక కూడా దీనికి ఆల్మోస్ట్ ఓకే చెప్పేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు.