హమ్మయ్య.. ఇన్నాళ్ళకి మన త్రివిక్రమ్ కి బల్బ్ వెలిగిందా..? ఇక పై ఒకరు కాదు ఇద్దరే..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు .. ఇప్పటివరకు ఆయన పేరుని ట్రోల్ చేసిన జనాలు లేరు. ఆయనకు అంత స్పెషల్ కేర్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఏదో హీరోయిన్స్ విషయంలో ఆయన పేరుకి సంబంధించి కొన్ని గాసిప్లు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నా.. అది నిజమని ప్రూవ్ చేయడానికి ఒక్క ఆధారం కూడా లేదు . ప్రెసెంట్ గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్ ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .

అంతేకాదు ఈ సినిమాతో ఆయన అతడు సినిమాకి మించిన హిట్ కన్ఫామ్ గా తన ఖాతాలో పడుతుంది అంటూ ఆయన కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమాకి కమిట్ అయ్యాడు త్రివిక్రమ్ . అయితే ఈ సినిమా కన్నా ముందే మరో సినిమాని తెరకెక్కించాలని భావిస్తున్నాడట త్రివిక్రమ్. ఈసారి ఆయన తెరకెక్కించే సినిమా మల్టీస్టారర్ మూవీగా తెలుస్తుంది .

నువ్వు నాకు నచ్చావ్ సినిమాకి సీక్వల్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. అయితే వెంకటేష్ తో పాటు ఈ సినిమాలో యంగ్ హీరో నాని కూడా నటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు జనాలు . త్రివిక్రమ్ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..? మల్టీ స్టార్లర్ సినిమాలు ఆయన తెరకెక్కిస్తే సినిమా రికార్డులు బ్లాస్ట్ అవుతాయి అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్..!!