ముంబైలో ఇల్లు కొన్న గ్లోబల్ స్టార్.. సడన్గా చెర్రీ రూటు మార్చడానికి కారణం అదేనా..?

ఇటీవల రామ్ చరణ్ ముంబై ట్రిప్ లో ఎక్కువగా వేస్తున్న సంగతి తెలిసింది. గ్లోబల్ స్టార్‌గా పాపులారిటీ వచ్చిన తర్వాత కచ్చితంగా హైదరాబాద్ తో పాటు ముంబాయి కూడా తిరగాల్సి ఉంటుంది కాబట్టి అటు ఇటు చెక్కర్లే కొడుతున్నాడు రామ్ చరణ్ అని అందరూ అనుకున్నారు. అయితే ఈసారి ఏకంగా తన భార్య ఉపాసన, కూతురు క్లినికారాతో కలిసి ముంబైకి చెక్కేసాడు చెర్రీ. అక్కడ చాలా పనులు చక్కబెట్టాడు. సీఎంను కలవడం, దైవదర్శనాలు, మ్యాగజైన్ కవర్ పేజ్‌కు పోజులు ఇవ్వడం ఇలా ఎన్నో పనులు పూర్తిచేశారు.

ఇక తాజాగా చెర్రీ కి సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉపాసన చరణ్ కలిసి అక్కడ ఓ ఇల్లు కూడా బేరం పెట్టారని.. ముంబైలో వాళ్లు వెళ్లినప్పుడల్లా ఉండడానికి సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అక్కడ ముంబైలో ఇల్లు కొనుక్కోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. నార్త్ లో కూడా చరణ్ కు మంచి పాపులారిటీ ఉంది. ఆర్ఆర్ఆర్‌తో ఆయన ఫాలోయింగ్ దానికి నాలుగింతలు రెట్టింపు అయింది. దాంతో ముంబైలో కూడా పలు ప్రాజెక్టులు చరణ్‌కు వస్తున్నాయట.

హిందీ నుంచి పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా వాటిని హోల్డ్ లో పెట్టిన చరణ్.. ఈమధ్య రాజ్ కుమార్ హిరానీ ఒక కథ చెప్పడంతో బాలీవుడ్‌లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట‌. దీంతో చరణ్ బంధం బాలీవుడ్‌తో బలపడుతోందని తెలుస్తుంది. దాంతో ముంబైలో పనులు ఎక్కువగా ఉంటాయి. అలాగే షూటింగ్ కి కూడా కొద్ది రోజులు కచ్చితంగా ముంబైకి రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా రెంట్లు తీసుకోవాలంటే కష్టం ఓ ఇల్లు కంటే సరిపోతుంది అని భావించిన మెగా ఫ్యామిలీ.. ముంబై లో ఇల్లు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట.

ఇక మెగా ఫ్యామిలీకి హైదరాబాద్ తో పాటు చెన్నైలో కూడా ఆస్తులు ఉన్నాయి. బెంగళూరులో పెద్ద ఫామ్ హౌస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో కూడా ఇల్లు కొనడానికి ప్లాన్ చేశారట. బాలీవుడ్ కేంద్రం అయినా ముంబైలో ఇల్లు ఉంటే ముందు ముందు కూడా చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. ఇక నిన్న మొన్నటి వరకు ముంబైలో తిరిగిన చరణ్ దంపతులు ఈ పనిని కూడా చక్కబెట్టుకుని వచ్చారంట వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.