మహేష్ ” గుంటూరు కారం ” పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన ఆ స్టార్ హీరో.. పోస్ట్ వైరల్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ సమస్య గ్రాండ్గా నిర్మించింది.

ఇక థమన్ సంగీతం అందించగా ఈ సినిమా ఈనెల 12న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఇక తాజాగా గుంటూరు కారం మూవీ గురించి బాలీవుడ్ భాషా షారుక్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ” నా ఫ్రెండ్ మహేష్ బాబు నటించిన యాక్షన్, ఎమోషనల్, మాస్ ఎంటర్టైనర్ గుంటూరు కారం మూవీ చూడాలని ఉంది ” అంటూ చెబుతూ ఆ మూవీ ట్రైలర్ ని అలానే హీరో మహేష్ బాబుని ట్యాగ్ చేశారు షారుక్.

ప్రస్తుతం ఈయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతానికైతే మహేష్ గుంటూరు కారాన్ని పక్కకి నెట్టి హనుమాన్ మూవీ దూసుకుపోతుంది. మరి రానున్న కాలంలో గుంటూరు కారం ఏ మాత్రం పికప్ అయినా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఏం జరుగుద్దో చూడాలి మరి.