చిరు, రామ్ చరణ్ కి ప్రత్యేక ఆహ్వానం అందించిన అయోధ్య వారు..!

జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కి కూడా ఈ ఆహ్వానం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు ఈ ఆహ్వానం అందింది.

ఇక ఈ ఆహ్వానం అందిన వారు రామ మందిరాన్ని చూసేందుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ ఆహ్వానం అందింది. చిరుకి ఒకడికే కాకుండా కుటుంబం మొత్తానికి ఆహ్వానం అందించారు అయోధ్య వారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ అయోధ్య ఓపెనింగ్ కి మెగా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇక సంక్రాంతి సందర్భంగా చరణ్ ఇటీవలే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇతర విలేజ్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక ఈ పండగ అనంతరం మెగా ప్రిన్సెస్ ని తీసుకుని అయోధ్యకి వెళ్ళనున్నారట మెగా ఫ్యామిలీ. ఇక చరణ్ ప్రస్తుతం ” గేమ్ చేంజర్ ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.