ప్రియుడితో అమెరికా చెక్కేస్తున్న బిగ్ బాస్ ప్రియాంక జైన్.. ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇటీవల తాజాగా ఎండ్ అయిన‌ సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఎంతోమంది భారీ పాపులారిటీని దక్కించుకున్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‌కు ఎలాంటి క్రెజ్‌ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సీజన్‌లో నటి ప్రియాంక జైన్ కూడా ఒక కంటిస్టెంట్ గా వ్యవహరించారు. హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ షో ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న ప్రియాంకా గతంలో బుల్లితెరపై పలు సీరియల్ లో నటించి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Romantic pics of rumoured couple Priyanka Jain and Shivakumar Marihal |  Times of India

ఇక వ్యక్తిగత విషయానికి వస్తే మౌనరాగం సీరియల్ లో ఈమెతో పాటు హీరోగా నటించిన శివ కుమార్ తో ప్రేమలో పడి అదే రిలేషన్షిప్ ను మెయింటెన్ చేస్తుంది. ఈ విధంగా శివకుమార్ ప్రేమలో ఉన్న ప్రియాంక త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని ఇటీవల ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. తాజాగా ప్రియాంక జైన్ మరొక షాకింగ్ విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫాన్స్ కు తెలియజేసి షాక్ ఇచ్చింది. త్వరలోనే ఈ జంట అమెరికా వెళ్ళబోతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే దీంతో ప్రియుడుతో కలిసి ప్రియాంక అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవుతుందని అంతా భావించారు.

Priyanka Jain: బిగ్‌బాస్‌లో అలా... బయట ఇలా.. పెళ్లిపై ఇలా షాకిచ్చిందేంటి  భయ్యా? | Bigg Boss Telugu 7 Beauty Priyanka Jain Comments on Marriage With  Shiva Kumar News Goes Viral - Telugu Filmibeat

కానీ మెల్లమెల్లగా అసలు విషయానికి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో తన ప్రియుడికి సెండ్ ఆఫ్ ఇస్తున్నటువంటి ఒక వీడియోని షేర్ చేసుకుంది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ కేవలం శివకుమార్ మాత్రమే అమెరికా వెళుతున్నట్టు.. తాను వెళ్లడం లేదని స్పష్టం చేశారు. వీసా కోసం అప్లై చేయగా ఇంటర్వ్యూ కి ఢిల్లీ రమ్మన్నారని.. ప్రస్తుతం శివ ఢిల్లీకి వెళ్లారని.. ఆయన సెలెక్ట్ కావడంతో రెండు నెలల పాటు అమెరికా వెళుతున్నారని అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో ప్రియాంక ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు.