మెగా ప్రిన్సెస్ పొంగల్ సెలబ్రేషన్స్ అక్కడే.. మెగా ఫ్యామిలీ జర్నీ స్టార్ట్..

మెగా ఫ్యామిలీ అంతా ఈసారి సంక్రాంతిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెగా ప్రిన్సెస్ క్లీన్ కారాకు ఇది మొదటి పండుగ కావడంతో.. ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా పొంగల్ను చేసుకోవాలనే ప్లాన్‌లో ఫ్యామిలీ ఉన్నారట. అయితే ఈ సెలబ్రేషన్స్ అంతా హైదరాబాద్‌లో కాకుండా మరో ప్లేస్ లో చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.

Suresh Kondeti on X: "𝙈𝙀𝙂𝘼 family is gearing up for 𝙎𝘼𝙉𝙆𝙍𝘼𝙉𝙏𝙄  celebrations in Bangalore. 𝑮𝒍𝒐𝒃𝒂𝒍 𝑺𝒕𝒂𝒓 @AlwaysRamCharan, along  with @upasanakonidela, and Mega Little Princess #KlinKaara, were captured  at the airport as they

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాది జూన్ లో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టింది. ఆమెకు క్లింకారా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక క్లింకార‌కు ఇప్పుడు జరగబోయే సంక్రాంతి ఫస్ట్ పండ‌గ కావడంతో.. బెంగళూరు ఫామ్ హౌస్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్ స్పెషల్ గా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ దంపతులు, ఆకీర్ నందన్ ఇలా ఎంతోమంది హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు.

Photo Moment: Mega family in Varun Tej-Lavanya Tripathi's pre-wedding  celebrations | 123telugu.com

ఇకపోతే చరణ్ ప్రస్తుతం గేమ్ చేజర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో షెడ్యూల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా చిన్న బ్రేక్ తీసుకొని.. పండుగ సెలబ్రేషన్స్ కోసం బెంగళూరు చెక్కేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ బెంగుళూరు సంక్రాంతి సెలబ్రేషన్స్ లో.. మెగా హీరోలంతా హాజరై సందడి చేయబోతున్నారట.