‘ నా సామి రంగ ‘ మూవీకి మొదలైన ఆ బ్యాడ్ సెంటిమెంట్ టెన్షన్.. నాగ్ దాన్ని బ్రేక్ చేయగలడా..?

టాలీవుడ్ నవ మన్మధుడు నాగార్జున.. ఇటీవల పూర్తి చేసిన బిగ్‌బాస్ సీజన్ 7 క్లిక్ కావడంతో మంచి జోరుగా ఉన్నారు. ఇక సంక్రాంతి కానుకగా ఆయన నటించిన తాజా మూవీ నా సామి రంగ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై నాగార్జున ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఓటిటి డీల్ గట్టిగానే సెటిల్ అయినట్లు సమాచారం. సుమారు రూ.18 కోట్ల బిజినెస్ నా స్వామి రంగాకు జరిగిందట. రూ.30 కోట్లకు పైగా ఓటీటీ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. హాట్స్టార్ నా సమీరంగా ఒటీటీ హక్కులను దక్కించుకుందట. ఓటిటితో నాగ్‌కి డైరెక్ట్ లింక్ ఉండడంతో బాగానే వర్కౌట్ అయిందని టాక్. ఇదిలా ఉంటే సినిమాపై బజ్‌ ఇప్పటికీ క్రియేట్ కాలేదు. సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఎవరు లేరు.

Naa Saami Ranga: First Look Of Nagarjuna's New Film Unveiled On His  Birthday; Release Date Announced | Watch

గుంటూరు కారం, హనుమాన్ లాంటి సినిమాల ముందు నా సామి రంగ సినిమాను ఎవరు పట్టించుకునే అవకాశం లేదు. అయితే రిలీజ్ అయిన తర్వాత సినిమాపై మంచి టాక్ వస్తే సినిమా పై అంచనాలు వచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి తోడు నాగ్‌కి రీమేక్ సెంటిమెంట్ ఈ సినిమా గురించి టెన్షన్ పెడుతుంది. నాగార్జున రీమేక్‌లో నటించిన ఏ సినిమా ఇటీవల కాలంలో సక్సెస్ సాధించలేదు. తెలుగులో గత రెండేళ్లుగా వచ్చిన రీమిక్ సినిమాలన్నీ ఒకటి, రెండు తప్ప మాక్సిమం అన్ని డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో నాగార్జున నా సామిరంగాకి కూడా రీమేక్ సెంటిమెంట్ భయం పట్టుకుంది. లో లోపల ఆయన చాలా టెన్షన్ పడుతున్నా బయటకు తన కథ పై కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు.

Naa Saami Ranga: Makers Introduce Ashika Ranganath As Varalakshmi; First  Single 'Yethukelli Povalanipisthunde' From Nagarjuna Akkineni's Film To Be  Out Soon (Watch Video) | 🎥 LatestLY

అయితే ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ఈ రీమేక్ సినిమా అయినా సక్సెస్ అవుతుందా, లేదా అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. దీనికి తోడు నెగిటివ్ ప్రచారం కూడా సినిమాపై జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే యుఎస్ లోను ప్రీమియర్ లేటుగా వేస్తున్నట్లు సమాచారం. ఏడు గంటల తరువాత ప్రీమియర్స్ పడిపోతున్నాయట‌. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు మొత్తానికి సినిమా పై నెగెటివిటీ రాకుండా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు నా సామి రంగ మేకర్స్. చూడాలి మరి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో. ఇక ఆశికా రంగనాథ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ పోరింజు మరియం జోసె.. మూవీకి రీమేక్ గా తెరకెక్కనుంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.