రష్మిక మందన్నాకి కూడా ఆ దోమ కుట్టిందా..? ఇక చచ్చం పో..!!

రష్మిక మందన్నా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.  అంతేకాదు నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ గురించి ఎక్కువగా జనాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా చరిత్ర తిరగరాసింది.  ఈ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ కి జనాలు ఫిదా అయ్యారు. కాగా ఇలాంటి రష్మిక ఇకపై బోల్డ్ రొమాన్స్ ఉన్న కంటెంట్ చేయకూడదు అంటూ డిసైడ్ అయిందట .

దానికి కారణం వాళ్ళ పేరెంట్స్ బాధపడడమే . యానిమల్ సినిమా చూసిన తర్వాత రష్మిక పేరెంట్స్ బాగా హర్ట్ అయ్యారట.  ఇకపై అలాంటి సినిమాలు చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారట . అంతేకాదు ఆమెను ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలో చూడాలి అని ఆశపడుతున్నారట . అందుకే రష్మిక ఇకపై ఎక్కువగా అలాంటి సినిమాలు చూస్  చేసుకోబోతుందట . త్వరలోనే రాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా కావడం గమనార్హం.

హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇటీవల అనౌన్స్‌మెంట్‌తో పాటు టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నాదీ అని చెప్పుకోవడానికి ఒక గర్ల్‌ ఫ్రెండ్‌ ఉంటే ఆ కిక్కే వేరురా..’ అనే వాయిస్‌ఓవర్‌తో మోషన్‌ పోస్టర్‌ ఆసక్తిని కలిగించింది.