వెంకీ ” సైంధవ్ ” మూవీ స్ట్రీమింగ్ పార్ట్నర్ అక్కడే..!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ , రుహాణి శర్మ అలానే ఆండ్రియా జెరెమియా సహా కోలీవుడ్ నటుడు ఆర్య లాంటి స్టార్స్ కలయికలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” సైంధవ్ “.

ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. ఇక ఈ సినిమా థియేటర్ రిలీజ్ తర్వాత ” సైంధవ్ ” మూవీ ఎందులో స్ట్రీమింగ్ కి వస్తుంది అనేది కన్ఫర్మ్ అయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ సమస్త అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేశారట.

ఓ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక టెలివిజన్ హక్కులు అయితే ఈటీవీ వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి వెంకీ మామ ఈ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి మరి.