మొన్న శోభన్ బాబు.. ఇప్పుడు ఏఎన్ఆర్.. ఏఐ ఎఫెక్ట్ తో అందరు హీరోలని మళ్ళీ పుట్టిస్తున్నారుగా..

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ ఎఫెక్ట్ తెగ వైరల్ అవుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొన్ని రోజుల క్రితం ఈ టెక్నాలజీని ఉపయోగించి స్టార్ హీరోయిన్ల డీఫ్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారు. ఆ తర్వాత క్రియేట్ విజువల్స్ తో ఎన్నో రకాల చెట్లు పక్షులు క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు సినీ సెలబ్రిటీల టెక్నాలజీ ద్వారా రిక్రియేట్‌ చేయడం మొదలుపెట్టారు.

ఇటీవల టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో శోభన్ బాబు ఈ జనరేషన్‌లో పుట్టి ఉంటే ఎలా ఉంటాడో అనే ఏఐ లుక్ ను క్రియేట్ చేసి రిలీజ్ చేయగా ఆ వీడియో నెట్టింటే తెగ వైరల్ అయింది. అంతా శోభన్ బాబు మళ్ళీ ఈ జనరేషన్లో శోభన్ బాబు పుడితే ఇలానే ఉంటాడు అంటూ ఆశ్చర్యపోయారు. ఇక తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరో పిక్ ఏఐ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేశారు.

ఇంతకీ ఆయన ఎవరో గుర్తుపట్టారా? ఎవరో కాదు సీనియర్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వరరావు. ఈ వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు హాలీవుడ్ టైప్‌ ఫీచర్స్ తో ఉంటే ఎలా ఉంటారు కనిపిస్తుంది. ఏ ఎన్ఆర్ ఈ తరం హీరోల హెయిర్ స్టైల్, కండలు, టోన్ ఫేస్, ట్రెండీ దోస్తులతో అక్కినేని నాగేశ్వరరావును రీ క్రియేట్ చేశారు. ఈ వీడియోను ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వ‌ర్మ షేర్ చేస్తూ ఏఎన్ఆర్ ను ఎంతో ఇంటిలిజెంట్గా క్రియేట్ చేశారు అంటూ టాగ్ చేసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.