వింటేజ్ ప్రభాస్ ని విట్నెస్ చేయడానికి టైం ఖరారు చేసిన మేకర్స్.. పోస్ట్ వైరల్..!

పాన్ ఇండియా స్టార్ రెబల్స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే ” సలార్ ” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ మూవీ అనంతరం తన నుంచి రానున్న మరో సెన్సేషనల్ మూవీ ” కల్కి “. ఈ సినిమా రిలీజ్ ని కూడా మేకర్స్‌ ఫిక్స్ చేశారు.

ఇక ఇప్పుడు మూడో హై ఇస్తూ దర్శకుడు మారుతితో చేస్తున్న మరో చిత్రంపై మేకర్స్ సాలిడ్ అప్డేట్ని ఇప్పుడు అందించారు. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ ఇది వరకే సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా దీనిని రివిల్ చేశారు.

వింటేజ్ ప్రభాస్ ని ఫిట్నెస్ చేయడానికి మన ఫస్ట్ లుక్ సహా టైటిల్ ఏంటి అనేది కూడా ఈ జనవరి 15న డేట్ ఫిక్స్ చేయగా ఆ రోజు తెల్లవారి జామునే కోడి కూత తర్వాత 7 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ఇప్పుడు ముహూర్తం ఖరారు చేశారు. ఇక ఇంతలా ఊరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.