ఆ విషయంలో కూడా మహేష్ ” గుంటూరు కారం ” ని బీట్ చేసి దూసుకుపోతున్న ” హనుమాన్ “…!

ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి పోటీ పడేందుకు రిలీజ్ అయిన సినిమాలలో మహేష్ ” గుంటూరు కారం “తో పాటు తేజ సజ్జ ” హనుమాన్ ” కూడా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా ఈనెల 12న రిలీజ్ అయ్యాయి. ఇక చిన్న సినిమా అయినప్పటికీ హనుమాన్ గుంటూరు కారాన్నే దెబ్బతీసింది.

గుంటూరు కారం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోగా హనుమాన్ మాత్రం సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. చిన్నోడే అయినా వెన్నుపోటు బానే పొడిచాడని చెప్పాలి. జనరల్ గా ఓ స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే దాని తాలూకా బుకింగ్స్ కానీ ఓపెనింగ్స్ లో కానీ మొదటి రోజు కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా లక్షల్లో ఉంటాయి.

కానీ నిజానికి ఒక మిడ్ రేంజ్ సినిమాగా వచ్చిన హనుమాన్ కూడా 1 లక్షలకి పైగా చిలుకు ఓపెనింగ్స్ రాబట్టగా గుంటూరు కారం కి కూడా లక్షకి పైగా వసూలు వచ్చాయి. దీంతో ఈ విషయంలో కూడా గుంటూరు కారం కి ఈ చిన్న సినిమా ఎంత టాప్ కాంపిటేషన్ ఇవ్వడం గమనార్హం. ఇక డే 2 సహా డే 3 లో కూడా ఈ రెండు సినిమాలకి సాలిడ్ బుకింగ్స్ రిజిస్టర్ అవుతూ కొనసాగుతున్నాయి.