నాగ్, తారక్ ఆ రంగంలో అంత సక్సెస్ సాధించడానికి వెంకటేష్ కారణమా..

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్‌ల‌తో నాగార్జున, తార‌క్‌ ఎలాంటి సక్సెస్ అందుకున్నారో అందరికీ తెలుసు. అయితే వాళ్లు ఈ షో కి హోస్టుగా చేయడానికి పరోక్షంగా విక్టరీ వెంకటేష్ కారణం కావడం విశేషం. మొదట వెంకటేష్ కు బిగ్ బాస్ షో హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం వచ్చిందట. అయితే ఆయన ఆఫర్ రిజెక్ట్ చేయడంతో నాగార్జున, ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించే అద్భుతమైన అవకాశాలను చేజ‌కించుకున్నారు.

Bigg Boss (Telugu TV series) - Wikipedia

అమెరికాలో ఎంబీఏను పూర్తి చేసిన వెంకటేష్ మొదట బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నాడు. అయితే అనూహ్యంగా కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయం అయ్యాడు. అర్థం ముందు తన ప్రాక్టీస్ చేసేవాడని అర్థమే తనకు ఫిలిం స్కూల్ అంటూ వివరించాడు. వెంకటేష్ క్రికెట్ ను ఎంతో ఇష్టపడతారు. బిగ్బాస్ తో పాటు ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి పెద్ద పెద్ద షోలకు హోస్టుగా చేసే అవకాశం వచ్చిన వాటిని రిజెక్ట్ చేశాడు.

EMK, Bigg Boss set to storm thirsty Telugu viewers

ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ ఉండే వెంకీ.. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాడు. ఇక ఈయనకి ఇప్పటికే ఆరు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. 30 కంటే ఎక్కువ రీమేక్ సినిమాలలో నటించి సక్సెస్ సాధించిన వెంకీ ఇతర హీరోలతో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించే విషయంలో కూడా వెంకీ మొదటి వరుసలో ఉంటాడు. ఇక వెంకటేష్ ఈ ఛాన్సులు రిజెక్ట్ చేయడంతోనే నాగార్జున.. ఎన్టీఆర్ కు బిగ్ బాస్ హోస్టులుగా అవకాశం వచ్చిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.