రోజుకు 7సార్లు ఆ పని చేస్తా.. బయటపడ్డ హృతిక్ రోషన్ గుట్టు..!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక చాలామంది బాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్ తో బాడీ రావడానికి చాలా కష్టపడతారు. దానికోసం కొన్ని రోజుల పాటు ఏమి తినరు కూడా. అలా ప్రతి సినిమాలో తన ఫిజిక్ లో ఇంప్రూవ్ చేసుకోవడానికి కష్టపడే హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు.

ప్రస్తుతం ఫైటర్ లో చేస్తున్న ఈయన లుక్, ఫిజిక్ ప్రేక్షకులకు చమటలు పట్టిస్తుంది. దీంతో అసలు ఆ ఫిజిక్ ఎలా వచ్చిందో, హృతిక్ ఏమి చేస్తాడు కొన్ని ఆసక్తికర విషయాలను తన ట్రైనర్ క్రిస్ గెథిన్ రివిల్ చేశారు. ” నేను నమ్మకం కలిగిన వారితో మాత్రమే పనిచేయడానికి ఇష్టపడతాను. అలాంటి వారిలో హృతిక్ రోషన్ కూడా ఒకరు. తనకు చాలా తెలివి ఉంది. తనకు ఏది వర్కౌట్ అవుతుంది, ఏది అవ్వదు అని తనకి బాగా తెలుసు. ” ఫైటర్ ” కోసం ఉదయం 5 గంటలకు లేచేవాడు.

6 గంటల కి తన టిఫిన్ తినేసేవాడు. హృతిక్ రోజుకు ఆరు నుంచి ఏడుసార్లు తినేవాడు. ఒకవేళ తినలేకపోతే వాటిని షేక్స్ రూపంలో తీసుకునేవాడు. కానీ ఎక్కువ శాతం అది ఫుడ్ రూపంలోనే తినేవాడు. అది పూర్తిగా ఒక బాడీ బిల్డింగ్ డైట్. అసలు తాను అలా ఎలా చేస్తాడో నాకు అస్సలు అర్థం అయ్యేది కాదు. వాటన్నిటిని ఒక ఇండియన్ ట్విస్ట్ ఇచ్చేవాడు. తనలో ఉండే లక్షణాలు వేరొకరితో ఉండవు. అలానే తనలాగా షేప్ అందరికీ రాదు ” అంటూ చెప్పుకొచ్చాడు క్రీస్ గెథిన్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.