నా సామిరంగా ప్రీమియర్ టాక్.. పక్కా సంక్రాంతి సినిమా.. సోగ్గాడి మాస్ జాతర షురూ..

నా మన్మధుడు నాగార్జున ఇటీవల నటించిన మూవీ నా సామి రంగ. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కసితో వున్నాడు నాగార్జున. గ‌త కొంత‌కాలంగా నాగ్‌కు సరైన హీట్ పడలేదు. ఈసారి సంక్రాంతి బరిలో మాత్రం హిట్ కొడతాను అంటూ గట్టి నమ్మకంతో ఉన్నాడు నాగ్‌. తాజాగా నా సామి రంగ ప్రీమియర్ షోస్ రిలీజై కొద్దిసేపటి క్రితమే టాక్ బయటకు వచ్చింది. మరి నా సామిరంగా సినిమా గురించి ఆడియన్స్ అభిప్రాయం ఏంటో ఒకసారి చూద్దాం. మెజారిటీ ఆడియన్స్ సినిమా పాటలు పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. నా సామిరంగా సంక్రాంతికి కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ మెన్షన్ చేస్తున్నారు.

నా సామిరంగా మలయాళ హిట్ మూవీ పూరింజు మ‌రియం జోసే రీమేక్‌గా తెర‌కెక్కింది. ఒరిజినల్ లో చాలా మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా నేటివిటీకి తగ్గట్లుగా తెరకెక్కించారు. నాగార్జున కృష్ణయ్యగా ఊరమాస్ రోల్ లో మెప్పించాడుజ‌ అల్లరి నరేష్ మరొక కీలక పాత్రలో క‌నిపించాడు. నాగార్జున, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్ మూల పాత్రలుగా ఈ సినిమా తెర‌కెక్కింది. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్ని కల‌గ‌లిపి వచ్చిన ఈ సినిమా నాగార్జునకు పాజిటివ్ టాక్ తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే కృష్ణయ్య పాత్రలో నాగార్జున అద్భుతంగా నటించాడట.

ఆయన లుక్, డైలాగ్స్, మేనరిజం.. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్‌లా ఉన్నాయి. చాలా టైం తర్వాత నాగార్జునకు సరిపోయే ఊర మాస్ రోల్‌లో దర్శకుడు నాగ్‌ను ప్రజెంట్ చేశాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక అల్లరి నరేష్, ఆశికా రంగనాథన్ కూడా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారని తెలుస్తుంది. కీరవాణి సంగీతం వేరే లెవెల్‌లో ఉందట. మొత్తంగా నా సామిరంగా కచ్చితంగా ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా అని టాక్ వినిపిస్తుంది. దర్శకుడు విజయ బిన్నీ నాగార్జునను గొప్పగా ప్రజెంట్ చేశాడట‌. ఇక ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.