మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తాము నటించిన సినిమాతోనే ఓవర్ నెట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన ముద్దుగుమ్మలు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆ తర్వాత మాత్రం కంటెంట్ ఎంపికలో తడబాటులతో అవకాశాలు దూరమైన వారు కూడా ఉన్నారు. అలాంటి లిస్టులోకే వస్తుంది ఈ పైఫోటోలో క‌నిపిస్తున ముద్దుగుమ్మ. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన ఈమె.. తరువాత ఎంత ప్రయత్నించినా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. హీరోయిన్గా సరైన అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు నటిస్తుంది.

ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. కెరీర్ స్టార్టింగ్ లో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్‌ల‌లో మాత్రమే చేస్తూ బిజీగా ఉంది. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ హెబ్బా పటేల్. 1989 జనవరి 6న జన్మించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి రాకముందు డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2014లో తిరుమనం సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

అయితే ఆమె నటించినా కన్నడ అధ్యక్ష మూవీ మొదట రిలీజ్ అయింది. ఆ తర్వాత అదే ఏడాదిలో అలా ఎలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. దీంతో ఈమెకు అంతగా గుర్తింపు కూడా రాలేదు. అయితే తర్వాత రాజ్ తరుణ్ హీరోగా నటించిన కుమారి 21ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డ‌మ్‌ అందుకుని.. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కుర్రాళ్ళ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత నటించిన అన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో వెండితెరకు దూరమైపోయింది.