నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే.. సమంత ఎమోషనల్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోను నెట్టింట ఎప్పుడు ట్రెండింగ్ అవుతూనే ఉండే ఈ ముద్దుగుమ్మ.. క్రేజీ సినిమాల్లో నటిస్తూనే అంతకంటే హాట్ కామెంట్స్ చేస్తూ నెట్టింట‌ వినిపిస్తూనే ఉంటుంది. డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా వైవాహిక జీవితం.. నాగచైతన్యను ఉద్దేశిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్లు వేసే ఈ అమ్మడు.. తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

నేను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సమంత. తాజాగా బ్రాడ్ కాస్ట్ ఛానల్లో అభిమానులతో ముచ్చటించిన సమంత.. తన జీవితంలో చేసిన పొరపాట్ల గురించి వివరించింది. మీరు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటి.. అని అభిమాని అడగగా బహుశా నా లైఫ్ లో చేసిన పెద్ద మిస్టేక్ నా సొంత అభిప్రాయాలను, ఇష్టాలను, అఇష్టాలను అర్థం చేసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది.

దానికి ఒక కారణం ఉంది. ఓ సమయంలో నేను భాగస్వామికి పూర్తిగా ప్రభావితం అయిపోయా. టైం బాలేనప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం ఉంటుందని త‌ర్వాత అర్థమైంది. ఇది నా వ్యక్తిగత జీవితానికి చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాను అంటూ సమంత కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ ను హెలెట్ చేస్తు వాటిని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. నాగచైతన్యను ఉద్దేశించే సమంత ఈ కామెంట్స్ చేసిందని అంతా భావిస్తున్నారు.