“నీ హగ్స్, నీ లవ్ నాకు కావాలి..నా జీవితంలోకి మళ్ళీ వచ్చేయ్ Baby” ..ఛార్మి పోస్ట్ వైరల్..!!

ఛార్మి కౌర్.. ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేసింది . ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పట్లో స్టార్ హీరోలు కూడా ఛార్మి కౌర్ డేట్ కోసం వెయిట్ చేసేవారు అంటే ఎంతలా ఆమె హవా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.

అయితే క్రమీణ ఆమె ఐటమ్ సాంగ్ లో నటించడంతో క్రేజ్ తగ్గిపోయింది . ఇప్పుడు అసలు ఆమె ఖాతాలో ఒక్క సినిమా ఆఫర్ కూడా లేదు . రీసెంట్గా ఆమె సినిమాలను ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. కాగ తాజాగా ఛార్మికౌర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది . చార్ర్మి ఓ పెట్ లవర్. కుక్కలను అమితంగా ప్రేమిస్తారు . ఆ విషయం అందరికీ తెలిసిందే .

ఆమె వద్ద మూడు హైబ్రిడ్ పెట్ డాగ్స్ కూడా ఉన్నాయి . రెండేళ్ల క్రితం ఒక డాగ్ దూరమైపోయిందట. దానిని తలుచుకొని తీవ్ర భావోద్వేగానికి గురైంది. నీ హగ్గులు , నీ ప్రేమ మిస్ అయిపోతున్నాను.. నువ్వు లేని జీవితం అసంపూర్ణం ..నువ్వు నన్ను వీడి రెండేళ్లు అవుతుంది .. మళ్లీ నా లైఫ్ లోకి నువ్వు వచ్చేయ్ బేబీ అంటూ కామెంట్ పెట్టింది”. అలాగే సదరు డాగ్ ఫోటోలు కూడా షేర్ చేసింది ఛార్మి. దీంతో ఛార్మి షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది..!!