ఎన్టీఆర్ వర్ధంతి స్పెషల్: ఆయన ఫుడ్ మెన్యూ చూస్తే కళ్ళు తిరిగి పోవాల్సిందే.. అది మాత్రం కంపల్సరీ..!

నవరస నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆయన నటన ..ఆయన అందం .. ఆయన తేజస్సు.. ఆయన బిహేవియర్ 100 జన్మలెత్తినా సరే మరి ఎవరికి రాదు.. రా బోదు ..రానే రాదు అని చెప్పడంలో సందేహం లేదు . తెలుగు సినీ పరిశ్రమకు ఓ కీర్తి మకుటం నందమూరి తారకరామారావు గారు . రాష్ట్ర రాజకీయాలను మార్చిన సంచలన ఘనత అందుకున్న ఏకైక హీరో కం రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారు.

ఒకటా రెండా ఆయన అడుగుపెడితే అక్కడ రికార్డులు బద్దలు కొట్టడమే .. అది సినిమా ఇండస్ట్రీ కాదు రాజకీయాలు కాదు ఏదైనా సరే వారు వన్ సైడ్ అయిపోవాల్సిందే. అలాంటి ఓ స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని అభిమానుల చేత అన్నా అంటూ పిలిపించుకున్నాడు నందమూరి తారక రామారావు గారు . నేడు ఆయన వర్ధంతి . ఈ క్రమంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు . అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్టీఆర్ ఫుడ్ డైట్ అంటూ పెద్దగా ఫాలో అయ్యే వాళ్ళు కాదు .. ఎన్టీఆర్ కడుపునిండా భోంచేసి ధిట్టగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు .

ఇప్పటి హీరోలులా డైటింగ్లు ఎక్సర్సైజులు అంటూ ఎన్టీఆర్ ఏమి చేసేవాడు కాదు . ఆయన సిద్ధాంతాలు వేరేలా ఉండేటివి . షూటింగ్ టైం తో పాటు ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండేవారు . ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉందంటే ఐదు గంటలకే నిద్రలేచి సెట్ కి చేరుకునేవారు . అలాంటి టైమింగ్ ఫాలో అవుతాడు. ఎన్టీఆర్ డైలీ మూడున్నర నుంచి నాలుగు గంటల మధ్యలోనే నిద్రలేచేవారు రాత్రి తొమ్మిదిలోపే పడుకునే వారట . ఎంత బిజీగా ఉన్నా ఆహారం విషయంలో మాత్రం ఆయన అస్సలు కాంప్రమైజ్ అయ్యేవారు కాదట.

ముఖ్యంగా అరచేతి మందంతో ఉన్న 25 ఇడ్లీలను ప్రతి రోజు తినే వారట . ఎన్టీఆర్ ఇడ్లీతో నాటుకోడిని నంచుకోవడం అంటే ఎన్టీఆర్కి బాగా ఇష్టమట . షూటింగ్ గ్యాప్ లో మరికొన్ని ఇడ్లీలు కూడా తినేవారట . అంతేకాదు మధ్య మధ్యలో ఆయనకు ఇష్టమైన పిండి వంటలు కూడా బాగా లాగించేసేవారట. పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకునే వారట . అంతేకాదు మధ్యాహ్నం భోజనంలోకి రాగి సంగటి పలు రకాల నాన్ వెజ్ కూరలు ఇష్టంగా తినే వారట .

ఆయనకు ఆపిల్ జ్యూస్ అంటే మహా ప్రాణం అట. మద్రాసులో ఉన్న టైంలో ఆపిల్ జూస్ ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లే వారట . ఆయన కు ఆపిల్ జూస్ లేనిదే రోజు గడవదట . ఒక్క రోజుకి ఐదు లీటర్ల ఆపిల్ జ్యూస్ తాగేసేవారట . అంతేకాదు బాదంపాలు కూడా ఇష్టంగా తాగేవారట . సాయంత్రం స్నాక్స్ కింద 25 మిరపకాయ బజ్జీలను పరాపరా నమిలేసేవారిట. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తినేవారట . రాత్రి డిన్నర్ లోకి రాగి జొన్న అట్టును అదేవిధంగా మాంసాహారంలను ఎక్కువగా తీసుకునే వారట. వెజ్ కూరలు అయితే కచ్చితంగా అందులో నెయ్యి కంపల్సరీ ఉండాల్సిందేనట . పెరుగు , మజ్జిగ కూడా ఎక్కువగా తీసుకునే వారట . ఎన్టీఆర్ ఫుడ్ డైట్ సీక్రెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!