ఇక్కడ తింగరి చూపులు చూస్తున్న ఈ అమ్మాయి.. ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వారి ఫొటోస్ చూసినప్పుడల్లా వాళ్లు ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్స్ ఏనా.. అసలు పోలిక లేదే.. అనిపిస్తూ ఉంటుంది. వారి మొద‌టి మూవీల‌కు ఇప్ప‌టి సినిమాల‌కు ముఖంలో, యాక్టింగ్‌లో ఎన్నో మార్పులు వస్తాయి. తాజాగా టాప్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకున్న ఓ స్టార్ హీరోయిన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్‌లో తన యాక్టింగ్ స్కిల్స్ ను నేర్చుకుంటున్న సమయంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె తన క్లాస్‌లో సైగలతోనే నటిస్తూ తన నటనను చూపిస్తుంది. ఇంతకీ ఆ పై ఫోటోలో ఉన్న ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

ఆమె స్టార్ హీరోయిన్ మాళవిక మోహన్. తాజాగా ఆమె యాక్టింగ్ ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ అప్పుడు చేసిన యాక్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. అక్కడున్నది హీరోయిన్ మాళవిక నేనా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. డైలాగ్స్ లేకుండా తింగరి చూపులు చూస్తున్నట్లుగా ఆ వీడియోలో ఆమె క‌నిపించింది. అలాంటి అమ్మాయి ఇప్పుడు టాప్ హీరోయిన్గా ఈ రేంజ్ కు రావడం గ్రేట్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కాగా మలయాళ సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మాళవిక.. మమ్ముట్టితో మొదట్లో యాడ్లో కనిపించింది.

తర్వాత పట్టం పోలే అనే మలయాళం మూవీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నాన్న మత్తు వరలక్ష్మి తో కన్నడ, బియాండ్ దా క్లౌడ్స్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన్న మాళవిక.. రజనీకాంత్ పేట మూవీతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో మెరిసింది. ఆ తర్వాత దళపతి విజయ్ మాస్టర్, ధనుష్ మారన్‌ సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించింది. దీంతో తెలుగులో కూడా మంచి పాపులారిటీ దక్కింది. ఇక ఇటీవ‌ల న‌టించిన అయాలన్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా ప్రభాస్ – మారుతి కాంబోలో తెరకెక్కుతున్న.. ది రాజసబ్ మూవీలోను ఈమె హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం.